Home > సినిమా > Mahesh Babu : మహేష్ కు జోడిగా ఇండోనేషియన్ హీరోయిన్?...నిజమెంత?

Mahesh Babu : మహేష్ కు జోడిగా ఇండోనేషియన్ హీరోయిన్?...నిజమెంత?

Mahesh Babu : మహేష్ కు జోడిగా ఇండోనేషియన్ హీరోయిన్?...నిజమెంత?
X

టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి పరిచయం చేశాడు దర్శకధీరుడు రాజమౌళి. బహుబలి(Bahubali)తో దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టించిన జక్కన్న(jakkanna)..తాజాగా త్రిబుల్ ఆర్ (RRR) తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. సినిమా విషయంలో చాలా పక్క ప్లానింగ్ తో ఉంటాడు రాజమౌళి. కథ, పాత్రలకు తగ్గట్టు దానికి సంబంధించిన ఆర్టిస్ట్ లను పక్కాగా సెట్ చేసుకుంటాడు. ఇప్పటికే RRR మూవీలో కథకు తగ్గట్టు వేరే దేశాల యాక్టర్స్, హీరోయిన్ ని కూడా తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా SSMB29 మూవీలో కూడా ఓ ఇండోనేషియా హీరోయిన్ ను తీసుకోబోతున్నారన్న వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ట్రిబుల్ ఆర్ తర్వాత (RRR) తర్వాత రాజమౌళి (Rajamouli) మహేష్ బాబుతో(Mahesh Babu) మూవీ తీస్తున్నారన్న విషయం తెలిసిందే. వీలిద్దరి కాంబోలో మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ట్రెజర్ హంట్, యాక్షన్ అడ్వెంచర్ మూవీలా ఉంటుందని గతంలో జక్కన్న చెప్పారు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయని, కథ కూడా పూర్తయిందని విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఈ మూవీలో మహేశ్ న్యూ లుక్ లో కనబడనున్నారు. ఇప్పటికే జర్మనీ వెళ్లి ట్రెక్కింగ్ కూడా నేర్చుకొని వచ్చారు. ప్రస్తుతం ఫుల్ జుట్టు, గడ్డం ఉన్న మహేష్ కొత్త లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే తాజాగా మహేశ్, రాజమౌళి సినిమాకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. SSMB29 మూవీలో ఓ ఇండోనేషియా హీరోయిన్ ను తీసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో విజయేంద్రప్రసాద్ ఈ సినిమాలో వేరే దేశాల యాక్టర్స్ కూడా ఉంటారని తెలిపారు. ఆల్రెడీ RRRలో తారక్ కు జోడిగా హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ ను తీసుకొచ్చిన రాజమౌళి...ఇప్పుడు చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ అనే ఇండోనేషియన్ భామను మూవీలో తీసుకొనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ప్రస్తుతం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ అవుతుంది. చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ పలు హాలీవుడ్, కొరియన్, ఇండోనేషియన్ సినిమాల్లో నటించింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో రాజమౌళిని ఫాలో అవుతడడంతో ఈ వార్తకు ఇంకా ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో కచ్చితంగా రాజమౌళి ఆమెని అప్రోచ్ అయి ఉంటాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మూవీకి ఆమె ఓకే చెప్పింది కాబట్టే.. రాజమౌళిని సోషల్ మీడియాలో ఫాలో అవుతుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం ఇది జస్ట్ రూమర్ అని కొట్టిపారేస్తున్నారు.










Updated : 12 Feb 2024 2:23 AM GMT
Tags:    
Next Story
Share it
Top