Home > సినిమా > రామ్ చరణ్ కోసం ఏఆర్ రెహ్మాన్...గ్లోబల్ లెవెల్‍ ప్లాన్

రామ్ చరణ్ కోసం ఏఆర్ రెహ్మాన్...గ్లోబల్ లెవెల్‍ ప్లాన్

రామ్ చరణ్ కోసం ఏఆర్ రెహ్మాన్...గ్లోబల్ లెవెల్‍ ప్లాన్
X

ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‎లో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఆర్‎సి 15 చిత్రం షూటింగ్‌ కి కాస్త బ్రేక్ పడినా మూవీని త్వరగా పూర్తి చేయాలని శంకర్ కసరత్తు చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్‎కి విడుదల అయయే అవకాశం ఉంది. రామ్ , శంకర్ సినిమా తో పాటు తన 16వ సినిమాను డైరెక్టర్ బుచ్చిబాబుతో చేస్తున్నాడు. రామ్ చరణ్ , బుచ్చిబాబు సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి మూవీకి సంబంధించి రోజుకో కొత్త అప్‎డేట్ వస్తోంది. తాజాగా మరో వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రామ్ చరణ్ RC16 సినిమాకు మ్యూజిక్ అందించేందుకు ప్రముఖ ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే కనుక జరిగితే దాదాపు 7 ఏళ్ల తరువాత రెహమాన్ తన బానీలను తెలుగులో వినిపించబోతున్నారని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.





స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ రమ్ , బుచ్చిబాబు సినిమా ఉండబోతోందని టాక్ . ఇప్పటి వరకు ఈ సినిమాకు ఎలాంటి పేరు పెట్టలేదు. సినిమాను బుచ్చిబాబు స్వయంగా నరేట్ చేసి ఏఆర్ రెహమాన్ ను ఒప్పించినట్లు తెలుస్తోంది. అయితే సంగీత దర్శకుడిపై ఇప్పటి వరకు మూవీ యూటిన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నిజానికి కొన్నాళ్ల క్రితమే ఈ సినిమా కోసం రెహమాన్ ని సంగీత దర్శకుడుగా తీసుకునే అవకాశం ఉందని టాక్ వినిపించింది. కానీ ఎందుకో ఆ రూమర్ పక్క పడిపోయింది. ఇప్పుఫు మరోసారి రెహమాన్ నే ఫైనల్ చేసినట్లు సమాచారం.





ఏఆర్ రహమాన్‍ కు భారత్‎లోనే కాదు విదేశాల్లోనూ కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన మ్యూజిక్ అంటే పడిచచ్చిపోయేవారు ఎంతో మంది ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రెహమాన్ ని తీసుకుంటే సినిమాకు గ్లోబల్ రేంజ్‍లో క్రేజ్ వస్తుందని ఆర్‌సీ16 చిత్ర యూనిట్ భావిస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్న రామ్‍చరణ్‍కు ఏఆర్ రహమాన్ జోడీ కలిపితే ఈ RC16 గ్లోబల్ సినిమాగా మరింత బజ్ దక్కించుకుంటుందని అంచనాలు ఉన్నాయి.








Updated : 8 July 2023 12:28 PM IST
Tags:    
Next Story
Share it
Top