Home > సినిమా > బడా సినిమాలో బడా డైరెక్టర్ ఎంటర్

బడా సినిమాలో బడా డైరెక్టర్ ఎంటర్

బడా సినిమాలో బడా డైరెక్టర్ ఎంటర్
X

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమా కల్కి ఏడీ 2898. ఈ సినిమా మీద చాలానే హైప్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా దీని కోసం ఎదురు చూస్తోంది అంటే అతిశయోక్తి కాదేమో. కల్కి గురించి ఏ వార్త వచ్చినా అది వైరల్ అయిపోతోంది కూడా. తాజాగా మరో క్రేజీ న్యూస్ బాక్సాఫీసును షేక్ చేస్తోంది.

కల్కి సినిమాలో ప్రభాస్ తో పాటూ పెద్ద పెద్ద యాక్టర్స్ నటిస్తున్నారు. ఇందులో దీపికా పడుకోన్ హీరోయిన్ గా చేస్తుండగా, అమితాబ్ బచ్చన్ కీ రోల్ చేస్తున్నారు. దాంతో పాటూ ఈ సినిమాలో విలన్ గా ఈ మధ్యనే కమల్ హసన్ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత దుల్కర్ సల్మాన్ కూడా కల్కిలో పార్ట అవుతున్నారని వార్తలు వినిపించాయి.అయితే దీని మీద మూవీ టీమ్ నుంచి మాత్రం ఏమీ కన్ఫర్మేషన్ రాలేదు. ఇవన్నీ కాక ఇప్పుడు కల్కి మూవీలో క్రేజీ డైరెక్టర్ రాజమౌళి ఎంటర్ అవుతున్నారనే వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఆయన అతిధి పాత్రలో నటించడమే కాక డైరెక్షన్ లో కూడా సలహాలు ఇస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త కేవలం ఫిల్మ్ సర్కిల్లోనే ఉండిపోలేదు. బయటకు వచ్చి కూడా తెగ వైరల్ అవుతోంది. అయితే దీని మదీ కూడా కల్కి మూవీ టీమ్ ఏమీ అధికారిక ప్రకటన ఇవ్వలేదు ఇప్పటివరకు.

మొత్తానికి కల్కి సినిమా మీద అంచనాలు మాత్రం రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. ఈ మధ్య విడుదల చేసిన గ్లింప్స్ కూడా వీటికి తోడయ్యాయి. ఇప్పుడు రాజమౌళి ఎంటరింగ్ వార్తతో మరీ క్రేజీ వచ్చింది ఈ మూవీకి. రాజమౌళి ఎక్కడుంటే అక్కడ బ్లాక్ బస్టర్ ఖాయం. ప్రపంచం అంతటికీ ఇది తెలిసిన విషయం. అందుకే ఇప్పుడు కల్కి మీద అంతో ఇంతో తక్కువ హోప్స్ ఉన్నవాళ్ళకు కూడా రాజమౌళి వచ్చారనగానే ఆశలు పెరిగిపోయాయి.

Updated : 30 Aug 2023 1:05 PM IST
Tags:    
Next Story
Share it
Top