సమంత మళ్లీ ప్రేమలో పడిందా?..ఆ పోస్ట్ కథేంటి?
X
దక్షిణాది స్టార్ బ్యూటీ సమంత తన కెరీర్లో దూసుకెళ్తోంది. టాలీవుడ్ , బాలీవుడ్లో వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంటోది ఈ బ్యూటీ గత కొంత కాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడిన సామ్ ఇప్పుడిప్పుడే నార్మల్ లైఫ్‌లోకి వచ్చింది. పర్సనల్ లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి బయట పడుతోంది. ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు సామ్ ఓ పెద్ద యుద్ధమే చేసిందంటారు సినీ విశ్లేషకులు. హెల్త్ ఇష్యూస్‌తో చాలా కాలం చేసిన పోరాటం తరువాత సామ్ ఇప్పుడు ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసింది. ఓ వైపు సినిమా షూటింగులకు హాజరవుతూనే మరోవైపు సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్‌కు లేటెస్ట్ పిక్స్‌తో ట్రీట్ ఇస్తోంది. తాజాగా సమంత తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసిన ఓ స్టోరీ ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సమంతా మళ్లీ ప్రేమలో పడిపోయిందా అన్న అనుమానాలకు ఆజ్యం పోస్తోంది.
ఎప్పటిలాగా సామ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోకు ఓ కొటేషన్‌ను జోడించింది. ‘మరణం నుండి మనల్ని ఏదీ రక్షించకపోతే ...కనీసం ప్రేమ అయినా మనల్ని జీవితం నుండి కాపాడాలి’ అంటూ పోస్ట్ పెట్టింది. ఈ కోట్స్ సమంత ఇప్పుడెందుకు షేర్ చేసిందనే టాక్ నెట్టింట్లో బాగా వినిపిస్తోంది. ఆమె మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో తెలియాల్సి ఉంది. అయితే.. గత కొంత కాలంగా సమంత మళ్లీ ప్రేమలో పడిందనే న్యూస్ నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది. ఈ టైంలో ఈ బ్యూటీ ఇలాంటి కోట్స్ షేర్ చేస్తుండటంతొ పలు అనుమానాలకు దారితీస్తోంది.