వెయ్యి మందితో ఫైట్...చూడ్డానికి రెండు కళ్ళూ చాలవు
X
ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సలార్. ప్రభాస్ అభిమానులు ఈ సినిమా గురించి ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. కేజీఎఫ్ తో చరిత్ర సృష్టించిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో మరింకెన్ని అద్భుతాలు చేస్తాడో అని ఎదురు చూస్తున్నారు. దీని గురించి ఎప్పటికప్పుడు క్రేజీ అప్డేట్ లు కూడా వస్తున్నాయి. తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సలార్ రెండు పార్ట్ లుగా విడుదల అవుతుందని ఇప్పటికే ప్రకటించారు మూవీ మేకర్స్. రీసెంట్ గా రిలీజ్ అయిన పార్ట్ -1 టీజర్ సినిమా మీద అంచనాలు అమాంతం పెంచేసింది. తాజాగా సలార్ సెట్ లో నేను ఇవి చూశాను అంటూ ప్రభాస్ అభిమాని ఒకరు కొన్ని విషయాలను మీడియాలో షేర్ చేశారు. ఇవి ట్విట్టర్ లో తెగ షేర్ అవుతున్నాయి.
సలార్ మూవీ విషయంలో ప్రశాంత్ నీల్ చాలా పర్టిక్యులర్ గా ఉన్నారుట. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చిన్న విషయాలను సైతం క్షణ్ణంగా పరిశీలించాకనే ఓకే చెప్తున్నారని అంటున్నారు అభిమాని. మూవీలో ఒక యాక్షన్ సీన్ ఉంటుందని అందులో ప్రభాస్ వెయ్యి మందితో ఫైట్ చేస్తారని చెబుతున్నారు. ఆ ఫైట్ షూట్ చూసి తాను చాలా ఆశ్చర్యపోయానని కూడా చెప్పారు. ఈ ఫైట్ లోనే మరో ప్రభాస్ కూడా ఎంట్రీ ఇస్తారని అందరినీ సర్ఫైజ్ చేశారు. ఒక ప్రభాస్ తోనే పిచ్చెక్కిస్తారు ప్రశాంత్ నీల్ అనుకుంటే...ఇద్దరున్నారా అని ఆశ్చర్యపోతున్నారు ప్రభాస్ అభిమానులు. ఎప్పుడెప్పుడు తెర మీద ఈ సినిమాను చూస్తామా అని తెగ ఆతృత పడిపోతున్నారు.
ఇంతకు ముందు కూడా ఈ సినిమాను నిర్మిస్తున్న హోంబలే నిర్మాత ఒ్ మీడియా సంస్థతో మాట్లాడుతూ క్లైమాక్స్ సీన్స్ అద్భుతంగా ఉంటాయని చెప్పారు. ఇప్పుడు ఈ వార్త బయటకు వచ్చాక ఆయన చెప్పినది కూడా దీని గురించే అయి ఉంటుందని అభిమానులు ఊహిస్తున్నారు.