ఆలియా ఔట్..సాయి పల్లవి ఇన్ ?
X
బాలీవుడ్లో మరో భారీ ప్రాజెక్ట్‌కు స్కెచ్ వేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. రామాయణం ఇతిహాసంగా మరో అద్భుతమైన సినిమాను తెరకెక్కించనున్నారు. నితీష్ తివారి డైరెక్షన్లో రూపొందనున్న ఈ సినిమాను ప్రొడ్యూజర్లు అల్లు అరవింద్, మధు మంతెన నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో రాముడిగా రాకింగ్ స్టార్ రణబీర్‌కపూర్ కనిపించనున్నాడు. నిన్నా మొన్నటి వరకు సీత పాత్రలో అలియాభట్ కనిపిస్తుందని వార్తలు వినిపించాయి. అయితే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ నుంచి అలియాభట్ అవుట్ అయ్యిందని తెలిసింది.
ఆలియా భట్ అటు హాలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో చేతి నిండా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. రామాయణం సినిమాలో నటించేందుకు ఆమె డేట్స్ కేటాయించలేకపోతున్నదని సమాచారం. ఈ క్రమంలోనే సీత పాత్రలో మరో నటిని ఎన్నుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌత్ బ్యూటీ న్యాచురల్ స్టార్ సాయిపల్లవి పేరు తెరమీదకు వచ్చింది. మేకర్స్ సీతగా సాయి పల్లవి పేరును పరిశీలిస్తున్నారని టాక్ బాలీవుడ్ లో వినిపిస్తోంది. ఇప్పటికే సాయిపల్లవితో సంప్రదింపులు పూర్తయ్యాయని సమాచారం. అంతే కాదు రామాయణం ఇతిహాసంగా వస్తున్న ఈ చిత్రంలో నటించేందుకు సాయిపల్లవి కూడా సానుకూలంగా ఉందనన్న వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సాయిపల్లవి సినిమాల ఎంపిక విషయంలో చాలా ఆచీతూచీ అడుగులు వేస్తోంది. ‘లవ్‌స్టోరీ’ తర్వాత తెలుగులో మరో చిత్రంలో నటించలేదు సాయి పల్లవి. చాలా రోజుల గ్యాప్ తర్వత ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు ఇన్ఫర్మేషన్.