Home > సినిమా > ఈ వారం సక్సెస్ సాధించే సినిమా అదేనా?

ఈ వారం సక్సెస్ సాధించే సినిమా అదేనా?

ఈ వారం సక్సెస్ సాధించే సినిమా అదేనా?
X

శుక్రవారం అయితే చాలు కొత్త సినిమాల సందడి అంతా ఇంత కాదు. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మూవీస్ అన్నీ రెడీగా ఉంటాయి. అటు ఓటీటీల్లోనూ ఇంట్రెస్టింగ్ మూవీస్ స్ట్రీమింగ్ అవుతాయి. ఇక ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి మూవీ లవర్స్‌ను కూల్ చేయడానికి ఈ వారం లేటెస్ట్ మూవీస్ సిద్దం అయ్యాయి. మెయిన్‌గా ఈ వారంలో నాలుగు సినిమాలు పోటీపడనున్నాయి. అందులో డీజే టిల్లు స్క్వేర్, ద గోట్ లైఫ్ (ఆడు జీవితం), కళియుగ పట్టణంలో, గాడ్జిల్లా ద న్యూ ఎంపైర్ వంటి చిత్రాలు పోటీ పడనున్నాయి.

ఈ మూవీస్‌లో ఎక్కువ మంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సినిమా డీజే టిల్లు స్క్వేర్. హీరో సిద్దూ జొన్నలగడ్డ, హీరోయిన్ అనుపమ క్రేజీ కాంబోలో ఈ మూవీ వస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ఈ మూవీ ఆకట్టుకోనుంది. ఇకపోతే మల్టీఫ్లెక్స్‌ల్లో గాడ్జిల్లా ద న్యూ ఎంపైర్ మూవీ సందడి చేయనుంది. వేసవిలో పిల్లలను అట్రాక్ట్ చేస్తూ వస్తోన్న ఈ మూవీ మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

ఇక కేరళ హీరో పృథ్వీరాజ్ నటించిన ద గోట్ లైఫ్ మూవీపై ప్రేక్షకులు అంతగా మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. ప్రధానంగా ఎడారి మధ్య సాగే ఈ కథ కోసం అంతగా ఎవ్వరూ వెయిట్ చేయడం లేదు. మొత్తానికి ఈ వారంలో డీజే టిల్లు స్క్వేర్ సినీ లవర్స్‌ను మంచి జోష్ లోకి తీసుకెళ్లనుందని స్పష్టంగా తెలుస్తోంది. మరి మీరు కూడా ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా?

Updated : 26 March 2024 2:40 PM IST
Tags:    
Next Story
Share it
Top