భారతీయ అందగత్తెతో టైటానిక్ హీరో ప్రేమాయణం
X
భారతీయ అందగత్తెతో టైటానిక్ హీరో ప్రేమాయణంటైటానిక్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు లియోనార్డో డికాప్రియో. ఈ పేరు ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్‌గా బాగా వినిపిస్తోంది. అయితే అందుకు కారణం ఆయన సినిమాలు మాత్రం కాదండోయ్.. తనకంటే 20 ఏళ్లు చిన్నదైన భారతీయ అందగత్తెతో లియోనార్డో డేటింగ్ చేస్తున్నాడు అంటూ రూమర్స్ ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా నటుడు , ఇండియన్ మోడల్ నీలమ్ గిల్, ఆమె తల్లితో కలిసి డిన్నర్ డేట్‌కు వెళ్లాడు. కొద్ది సమయంలోనే, మోడల్‌తో పాటు నటుడి చిత్రాలు నెట్టింట్లో ప్రత్యక్షమై వైరల్ అయ్యాయి. దీంతో ఇద్దరి మధ్య డేటింగ్ పుకార్ల మరోసారి ఊపందుకున్నాయి.
హాలీవుడ్ స్టార్, టైటానిక్ ఫేమ్ హీరో లియోనార్డో డికాప్రియో , భారత సంతతికి చెందిన మోడల్‌తో డేటింగ్ చేస్తున్నాడన్న న్యూస్ ఇంటర్నేషనల్ వైడ్‌గా పెద్ద చర్చనీయాంశంగా మారింది. గత కొంత కాలంగా 48 ఏళ్ల వయసున్న డికాప్రియో 28 ఏళ్ల నీలమ్ గిల్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ జంట ఇటీవల లండన్‌లోని చిల్టర్న్ ఫైర్‌హౌస్‌లో డిన్నర్ చేస్తూ కెమెరా కళ్లకు చిక్కింది. దీంతో మరోసారి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే చర్చ జరుగుతోంది. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.
నీలమ్ గిల్ భారతీయ సంతతికి చెందిన పంజాబీ మోడల్. ఇటీవల జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ఈ బ్యూటీ రెడ్ కార్పెట్‌పై మెరిసింది. 14 ఏళ్ల వయసులోనే మోడలింగ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది నీలమ్. అనతికాలంలోనే మంచి గుర్తింపును పొందింది. సోషల్ సర్వీసుల్లో నీలమ్ చాలా చురుకుగా పాల్గొంటూ ఫేమస్ అయ్యింది. రీసెంట్గా నీలమ్ ఇండియాలోనూ సందడి చేసింది. నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇప్పుడు టైటానిక్ హీరోతో డేటింగ్ రూమర్లతో మరోసారి ఈ బ్యూటీ ఫేమస్ అయ్యింది.
డికాప్రియో గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ చాలా పెద్దదే. 48 వయసులోనే ముగ్గురిని పెళ్లి చేసుకుని ఆ ముగ్గురికి విడాకులు కూడా ఇచ్చేశాడు. ఈయన చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ కూడా చేశారు. చివరగా డికాప్రియా నటి కామిల్లాత కొన్నేళ్లు డేటింగ్ చేసి గత ఏడాదే వారి రిలేషన్‌కు బ్రేకప్ చెప్పుకున్నారు. లేటెస్టుగా తనకంటే వయసులో 20 ఏళ్లు చిన్నదైన ఇండియన్ మోడల్‌తో ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.