Home > సినిమా > మళ్లీ తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్? సినిమాలకు ఇక సెలవేనా?

మళ్లీ తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్? సినిమాలకు ఇక సెలవేనా?

మళ్లీ తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్? సినిమాలకు ఇక సెలవేనా?
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్..నార్త్ ఇండియన్ బ్యూటీ కాజల్ అగర్వాల్‎కు దక్షిణాదిలో మంచి క్రేజ్ ఉంది. తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లోనూ ఎన్నో సినిమాల్లో హీరోయిన్‎గా నటించిన కాజల్ 2020లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2021లో పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆ తరువాత కాజల్ ఇక సినిమాలు చేయదు అనే టాక్ నెట్టింట్లో బాగా వినిపించింది. కానీ పాప పుట్టిన కొద్ది రోజుల్లోనూ తన సోషల్ మీడియాలో ప్రొఫైల్స్‎లో క్రేజీ ఫోటో షూట్ పిక్స్‎ను పోస్ట్ చేసి నటించేందుకు నేను రెడీ అని చెప్పకనే చెప్పేసింది. అందుకోసం బొద్దుగా మారిన భామ కాస్త బక్కచిక్కిన అందాలతో ఫిల్మ్ మేకర్స్‎ను ఆకర్షించింది. వెబ్ సిరీస్‎లతో తన సెకెండ్ ఇన్నింగ్స్‎ను ప్రారంభించింది కాజల్.



లేటెస్టుగా కాజల్ వరుస సినిమాలతో వెండితెర ముందు సందడి చేసేందుకు రెడీ అయ్యింది. టాలీవుడ్, కోలీవుడ్ సీనియర్ నటులతో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది ఈ బ్యూటీ. తమిళంలో తెరకెక్కుతున్న కమల్‎హాసన్‎తో కలిసి నటిస్తున్న ఇండియన్ 2 చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇక తెలుగులో బాలకృష్ణకు జోడీగా భగవంత్ కేసరిలో నటిస్తోంది కాజల్. ఈ క్రమంలో తాజాగా కాజల్ గురించి నెట్టింట్లో ఓ షాకింగ్‌ ప్రచారం వైరల్ అవుతోంది. ప్రస్తుతం కాజల్ మరోసారి ప్రెగ్నెంట్ అయ్యిందని, త్వరలో కాజల్‌ నటనకు గుడ్‎బై చెప్పబోతోందని టాక్ వినిపిస్తోంది.



అయితే ఈ పుకారు ఎంత వరకు నిజం అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే కాజల్ గ్యాప్ ఇవ్వకండా తన సామాజిక మాధ్యమాలలో అందమైన ఫోటో షూట్ పిక్స్‎ను పోస్టూ చేస్తూ ఫ్యాన్స్‎ను అలరిస్తోంది. కొత్త అవకాశాల కోసమే ఈ ఫోటో షూట్స్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఈ టైంలో కాజల్ నటనకు గుడ్ చెప్పడం అనేది నమ్మశక్యం కాని ప్రచారం అనే భావించాలని కొంత మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే కాజల్‌ మాత్రం ఈ రూమర్‎పై ఇంకా స్పందించలేదు.








Updated : 15 Jun 2023 11:41 AM IST
Tags:    
Next Story
Share it
Top