నా బ్రేకప్స్ గురించి కౌంట్ చేసి చెప్పడం చాలా కష్టం..రష్మి
X
తెలుగు బుల్లితెరపై ఎందరో యాంకర్స్ ఉన్నా .. తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్‌ను సొంతం చేసుకుంది యాంకర్ రష్మీ .. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినా..ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. కొన్నేళ్ల తర్వాత ‘జబర్దస్త్ షోలో యాంకర్‌గా అవకాశం అందుకుంది . అప్పటి నుంచి యాంకర్ రష్మీకి ఫాలోయింగ్ పెరిగింది. అటు యాంకర్‌గా చేస్తూనే సినిమాల్లోనూ నటిస్తోంది రష్మి. గుంటూరు టాకీస్ సినిమాతో అమ్మడికి క్రేజ్ బాగా పెరిగింది. సోషల్ మీడియాలో కూడా యాంకర్ రష్మీ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. ఒక్కోసారి ఆమె మాట్లాడే మాటలు నెట్టింట చర్చలకు, విమర్శలకు దారితీస్తుంటాయి.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రష్మీ ఏం మాట్లాడిన ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అలాగే రష్మీ ప్రేమ , పెళ్లి వ్యవహారాలు కూడా తరచూ చర్చనీయాంశం అవుతాయి.. మరీ ముఖ్యంగా సుధీర్ -రష్మీ ప్రేమ హాట్ టాపిక్ అవుతుంది. రష్మీ అంటే సుధీర్.. సుధీర్ అంటే రష్మీ.. అన్నట్లుగా మారింది పరిస్థితి . వీళ్ల జోడీకి ఉండే కెమిస్ట్రీతో బాగా పాపులర్ అయ్యారు. వీళ్లను లవ్ బర్డ్స్‌లానే ఆడియెన్స్ ట్రీట్ చేస్తుంటారు. వీళ్లిద్దరూ ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చని అంతా భావిస్తుంటారు. అయితే, గత కొంత కాలంగా వీరి జోడీ ఎక్కడా ఆన్‌స్క్రీన్‌పై కనిపించడం లేదు. వీరిద్దరూ జోడీగా కనిపించడం లేదని వాళ్ల ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతున్నారు. ఇలాంటి సమయంలోనే రష్మీ ఓ హార్ట్ బ్రేకింగ్ న్యూస్ చెప్పి, ప్రేక్షకులను అయోమయంలో పడేసింది..
తాజాగా రష్మీ మాట్లాడుతూ.." ప్రతి ఒక్కరి జీవితంలో 16 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు బంధాలు, లవ్ ఫెయిల్యూర్స్ ఉంటూనే ఉంటాయి. నా బ్రేకప్స్ గురించి కౌంట్ చేసి చెప్పడం చాలా కష్టం"అని చెప్పుకొచ్చింది. దీన్నిబట్టి చూస్తుంటే యాంకర్ రష్మీ మనసు కూడా ఇప్పటికే చాలాసార్లు బ్రేక్ అయిందని భావిస్తున్నారు. ఇక జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలకు యాంకరింగ్ చేస్తూ రష్మీ బిజీగా ఉంటుంది. వీటితోపాటు అప్పుడప్పుడు సినిమాలు కూడా చేస్తూ ఉంటుంది. ఈ మధ్యే భోళా శంకర్ మూవీలో చిరుతో కలిసి ఓ పాటలో స్టెప్పులేసింది. తాజాగా కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసి, తెలుగులో రిలీజ్ కాబోతున్న 'బాయ్స్ హాస్టల్' చిత్రంలో గెస్ట్ రోల్ చేసింది. ఈ ఈవెంట్‌లో రష్మీ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అవే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
It is very difficult to count my breakups says anchor Rashmi gowtham