Home > సినిమా > బిగ్ బాస్‌7 .. ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది ఆమెనే

బిగ్ బాస్‌7 .. ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది ఆమెనే

బిగ్ బాస్‌7 .. ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది ఆమెనే
X

బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍ మొదలై అప్పుడే వారం కావొస్తుంది. చిత్ర విచిత్రమైన సంఘటలు.. ఊహకే అందని మలుపులు.. మొత్తంగా సరికొత్త కంటెంటె‌తో సాగుతూ ప్రేక్షకులకు మజాను అందిస్తోంది. ఇందులో మొదటి వారం ఊహించని ఓటింగ్ జరిగినట్లు తెలిసింది. ఉల్టా పుల్టా కాన్సెప్టుతో సాగుతున్న ఏడో సీజన్‌లో ప్రీమియర్ ఎపిసోడ్ నుంచి ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. మొత్తంగా గతంలో ఎన్నడూ చూడని కొత్త కొత్త టాస్కులు కూడా చూపిస్తున్నారు. దీంతో ఈ సీజన్‌పై ఆరంభంలోనే అందరిలో ఆసక్తి పెరిగిపోయింది.

అయితే పేరుకు తగ్గట్లుగానే నిజంగానే అంతా ఉల్టా పుల్టాగా ఉంది ఈ ఏడో సీజన్. కొన్ని వారాల తర్వాత రావాల్సిన ఇమ్యునిటీ టాస్కును బిగ్ బాస్ ఫస్ట్ వీకే ఆడించాడు. ఈ టాస్కులో అబ్బాయిల నుంచి ఆట సందీప్, అమ్మాయిల నుంచి ప్రియాంక జైన్ గెలిచి మొదటి ఇద్దరు కంటెండర్స్ గా నిలిచారు. అనంతరం బిగ్ బాస్‍ను మెప్పించిన వారు ఇమ్యూనిటీ టాస్క్ బరిలో కంటెండర్‍గా నిలుస్తారు అని చెప్పాడు. ఇందులో రతిక, శివాజీ తనను మెప్పించినట్లు, వారిని కంటెండర్లుగా సెలెక్ట్ చేశాడు బిగ్ బాస్. ఇక ఈ నలుగురిలో ఏ ఇద్దరూ అనర్హులో చెప్పి నామినేట్ చేయాల్సిందిగా మిగతా హౌజ్ సభ్యులకు ఆదేశమిచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్కులో అధికంగా రతిక, శివాజీలు నామినేట్ అయ్యారు. దీంతో ఇమ్యునిటీ టాస్క్ ఫైనల్‍లోకి ఆట సందీప్, ప్రియాంక్ జైన్ వెళ్లారు.

ఇదిలా ఉండగా.. మొదటి వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ గత మంగళవారం రాత్రి నుంచి మొదలైంది. ఇది ఎవరూ ఊహించని రీతిలో జరిగినట్లు తెలిసింది. ముఖ్యంగా కామన్ మ్యాన్‌గా వచ్చిన పల్లవి ప్రశాంత్‌కే ఏకంగా 40 శాతం ఓట్లు పోలైనట్లు సమాచారం. ఓటింగ్ పూర్తయ్యే సమయానికి రెండో స్థానంలో లోకల్ బ్యూటీ రతికా రోజ్ ఉన్నట్లు తెలిసింది. వీళ్ల తర్వాత మాత్రం వరుసగా శోభా శెట్టి మూడో స్థానంలో, గౌతమ్ కృష్ణ నాలుగో స్థానంలో, షకీలా ఐదో స్థానంలో ఉన్నట్లు తెలిసింది. వీళ్లందరూ దాదాపుగా సేఫ్. ఇక ప్రిన్స్ యావర్ ఆరో స్థానంలో ఉండగా.. దామిని ఏడో స్థానంలో.. కిరణ్ రాథోడ్ ఎనిమిదో స్థానంలో నిలిచి డేంజర్ జోన్‌లో ఉన్నారని తెలుస్తోంది. అంటే వీళ్ల ముగ్గురిలోనే ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే చాన్స్ కనిపిస్తోంది. ఎక్కువగా కిరణ్ రాథోడ్‌ వెళ్లిపోయే అవకాశం ఉంది.

Updated : 9 Sept 2023 11:11 AM IST
Tags:    
Next Story
Share it
Top