Pushpa 2 The Rule : లెక్కల మాస్టారుని కలవరపెడుతున్న ఒక్క సాంగ్
X
పుష్ఫ 2 కోసం లెక్కల మాస్టారు తెగ కష్టపడుతున్నారు. పుష్ప విపరీతంగా సక్సెస్ అవడంతో రెండో పార్ట్ ను చెక్కుతున్నారు. ప్లాన్ ప్రకారమే అన్నీ జరుగుతున్నాయని చెబుతున్నారు. షూటింగ్ అలస్యమవుతోంది కానీ....సినిమా వచ్చాక బొమ్మ అదిరిపోతుందని ఊరిస్తున్నారు. కానీ ఒక్క విషయంలో మాత్రం చాలా వర్రీ అవుతున్నారుట సుకుమార్. ఎంత ట్రై చేసినా ఆ సమస్య మాత్రం తీరటం లేదుట.
సుకుమార్ కు తన సినిమాల్లో ఓ పెద్ద సెంటిమెంట్ ఉంది. అది కనుక ఉంటే అతని సినిమా పక్కా హిట్. అదే ఐటెమ్ సాంగ్. సుకుమార్ బంపర్ హిట్ లు అయిన అన్ని సినిమాల్లో ఈ ఐటెమ్ సాంగ్ దే కీ రోల్ ఉంటుంది ఎప్పుడూ. ముందు సాంగ్ హిట్ అవుతుంది. దాని తరువాత సినిమా. పుష్ప-1 లో కూడా సమంత చేసిన ఊ అంటావా సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. దేశ, విదేశాలను ఈ పాట ఒక ఊపు ఊపింది. దీనికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. అసలు చెప్పాలంటే ఐటెమ్ సాంగ్ లేని సుకుమార్ సినిమా ఉండదు అంతే.
కానీ ఇప్పుడదే లెక్కల మాస్టారుకి పెద్ద తలనొప్పి అయి కూర్చుందిట. మొదటి సినిమాలో సమంత సాంగ్ ఓ రేంజ్ లో హిట్ అవడంతో ఇప్పుడు రెండో పార్ట్ లో అంతకు మించి సాంగ్ పెట్టాల్సి ఉంటుంది. ఊ అంటావా కన్నా ఎక్కువ కిక్ ఇచ్చే సాంగ్ కావాలి, సమంతను మరిపించే హీరోయిన్ కూడా కావాలి. దీని కోసం ఇప్పటికే ఇద్దరు హీరోయిన్స్ ను అనుకున్నారు. శ్రీలీలను కూడా సంప్రదించారు. కానీ ఏవీ వర్కౌట్ అవ్వలేదు. దేవి శ్రీ ప్రసాద్ సాంగ్ ఇవ్వడానికి రెడీగానే ఉన్నా హీరోయిన్ ఎవరో తేల్చుకోలేకపోవడంతో ఇదో పెద్ద తలనొప్పి అయిపోయింది సుకుమార్ కు అని ఇండస్ట్రీ టాక్. పుష్ప 2 సాంగ్ కెరీర్‌లోనే బెస్ట్ స్పెషల్ సాంగ్ అవ్వాలని కసరత్తులు చేస్తున్నారుట.
. movies, pan india, telugu, pushpa-2, allu arjun, sukumar, director, itme song, devi sri prasad, heroin