Home > సినిమా > Mukku Avinash : అవినాష్ ఇంట్లో విషాదం.. బిడ్డను కోల్పోయిన కమెడియన్

Mukku Avinash : అవినాష్ ఇంట్లో విషాదం.. బిడ్డను కోల్పోయిన కమెడియన్

Mukku Avinash : అవినాష్ ఇంట్లో విషాదం.. బిడ్డను కోల్పోయిన కమెడియన్
X

కమెడియన్ అవినాష్ ఇంటా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తనకు పుట్టబోయే బిడ్డను కోల్పోయినట్లుగా అవినాష్ ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. తను తండ్రి కాబోతున్నాననే సంతోషంతో భార్య అనుతో కలిసి ఎన్నో వీడియోలో చేసిన అవినాష్.. హఠాత్తుగా బిడ్డను కోల్పోవడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయాడు.

'నా లైఫ్‌లో సంతోషమైన, బాధ అయినా.. నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటివరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ మొదటి సారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. మేము అమ్మ నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎదురు చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డనీ కోల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది. అంత తొందరగ మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలీ అన్న బాధ్యతతో ఈ విషయాన్నీ మీతో పంచుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు మాపై చూపించిన ప్రేమకు థాంక్యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనూజ అవినాష్' అంటూ అవినాష్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.

ఈ వార్తను చదివిన అభిమానులు అవినాష్‌కు ఓదార్పునిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. తన షోలతో అందరిని కడుపుబ్బ నవ్వించే అవినాష్‌కు ఇలాంటి పరిస్థితి రావడంతో సానుభూతిని ప్రకటిస్తున్నారు

Updated : 7 Jan 2024 8:10 AM IST
Tags:    
Next Story
Share it
Top