Home > సినిమా > లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఇమ్ము..ఆ వలంటీర్‎గా వచ్చేస్తున్నాడ్రోయ్

లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఇమ్ము..ఆ వలంటీర్‎గా వచ్చేస్తున్నాడ్రోయ్

లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఇమ్ము..ఆ వలంటీర్‎గా వచ్చేస్తున్నాడ్రోయ్
X

జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన చాలా మంది కమెడియన్స్ తెలుగు సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. స్టార్ హీరోల సినిమాల్లోనూ ఛాన్సులు అందుకుంటూ అభిమానుల లిస్టును పెంచుకుంటున్నారు. తాజాగా ఇన్నాళ్లు తన కామిక్ సెన్స్‎తో బుల్లితెరమీద నవ్వులు పూయించిన జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానుయేల్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఓ వెబ్ సిరీస్‎తో అలరించేందుకు రెడీ అయ్యాడు ఇమ్ము. ఓ పల్లెటూరి ప్రేమకథా చిత్రం కోసం ఇమ్మానుయేల్‎ ప్రేమ వలంటీర్‎గా మారిపోయాడు. ఇమ్మూకు తెలుగురాష్ట్రాల్లో చాలా మందే అభిమానులు ఉన్నారు. టీవీలోనే కాదు సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని సోషల్ మీడియాలోనూ తన కామెడీతో అందరినీ అలరిస్తున్నాడు. లేస్టుగా తన మిత్రులతో ఈ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నాడు.ఈ క్రమంలో ఈ వెబ్ సిరీస్‎కు సంబంధించిన ట్రైలర్‎ను లాంచ్ చేశాడు ఇమ్ము.

'ప్రేమ వాలంటీర్' వెబ్ సిరీస్ తో తొలిసారిగా హీరోగా పరిచయం అవుతున్నాడు ఇమ్మానుయేలు. కామెడీ నటులు హీరోలు కావడం కొత్తేమి కాదు. ఇండస్ట్రీలో చాలా మంది కమెడియన్లు తమ అదృష్టాన్నా పరీక్షించుకున్నారు. కానీ ఒకటి రెండు సినిమాలు మినహా కమెడియన్స్ కు పెద్దగా హీరోలుగా ఆఫర్స్ ఏమి రావడం లేదు. ఇదే క్రమంలో ఇమ్మూ కూడా తన లక్‎ను పరీక్షించేందుకు ఈ వెబ్ సిరీస్‌ తో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘జబర్దస్త్’ బాబు రచన, ఈ వెబ్ సిరీస్‎ను డైరెక్ట్ చేయడం విశేషం. ఇమ్మానుయేలుకు జంటగా విజయ విజ్జు కనిపించనుంది.

లేటెస్టుగా ప్రేమ వలంటీర్ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను ఇమ్మానుయేలు శనివారం రిలీజ్ చేశాడు. ఈ వెబ్ సిరీస్‌లో ఇమ్మానుయేలు గ్రామ వాలంటీర్‌గా కనిపించాడు. ఓ గ్రామ వాలంటీర్ అదే గ్రామంలో ఉంటున్న అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమలో పడేసే ప్రేమ వాలంటీర్‌గా మారిపోతాడు. పక్కా విలేజ్ బ్యాక్ గ్రౌండ్‏లో కథ నడుస్తుంది. ట్రైలర్‎ను కూడా ట్రైలర్ ను ఆదరిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్‎లోఇమ్మానుయేలు తన మార్క్ కామెడీతో అదరగొడతాడని తెలుస్తోంది. ఇమ్మూ రిస్క్ తీసుకుని మరీ హీరోగా ఎంట్రీ ఇస్తుండటంతో అభిమానులు అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు. మంచి పేరు సాధించాలని కోరుతున్నారు. మరి ఈ వెబ్ సిరిస్ ఇమ్మూ కెరీర్‎ను ఎలా మలుపు తిప్పుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే...



Updated : 5 Aug 2023 8:21 AM IST
Tags:    
Next Story
Share it
Top