Home > సినిమా > అమ్మాయిగా మారడంపై క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్..

అమ్మాయిగా మారడంపై క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్..

అమ్మాయిగా మారడంపై క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్..
X

జబర్దస్త్.. ఎంతో మంది కమెడియన్లకు కొత్త జీవితాన్ని ఇచ్చిన షో. వినోదంతో పాటు ఈ షోపై విమర్శలూ ఎక్కువే. ఇక ఈ ప్రోగ్రాం వల్ల ఎంతోమంది ఫేమస్ అయ్యారు. ఇందులో లేడీ గెటప్స్తోనూ అబ్బాయిలు ఆకట్టుకుంటున్నారు. లేడీ గెటప్తో ఫేమస్ అయిన సాయి తేజ సర్జరీ చేయించుకుని ప్రియాంకగా మారాడు. ఆ తర్వాత బిగ్ బాస్లోనూ పార్టిసిపేట్ చేసి మస్త్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో మరో జబర్దస్త్ కమెడియన్ సర్జరీ చేయించుకోకుండానే అమ్మాయిగా మారాడు.

జబర్దస్త్లో లేడీ గెటప్స్తో మెప్పించాడు సాయి. చూడటానికి అచ్చం అమ్మాయిలా ఉండే సాయి.. సాయిలేఖగా ఎన్నో స్కిట్స్లో అలరించాడు. ఇప్పుడు నిజంగానే అమ్మాయిగా మారిపోయాడని టాక్ వినిపిస్తుంది. సర్జరీ చేయించుకుని అతడు అమ్మాయిలా మారాడని వార్తలొచ్చాయి. ఈ ప్రచారంపై సాయి స్పందించాడు. తాను ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని క్లారిటీ ఇచ్చాడు. సర్జరీ చేయించుకుంటేనే అమ్మాయిగా మారాలా.. చేయించుకోకుండా కూడా మారొచ్చు అని చెప్పాడు.

చిన్నప్పటి నుంచే తనకు అమ్మాయిలా రెడీ అవ్వడం ఇష్టమని సాయి చెబుతున్నాడు. చీర కట్టుకోవడం, మేకప్ వేసుకోవడం వంటివి చిన్నప్పటి నుంచే చేశానన్నారు. ఇతరులు తన గురించి ఏమనుకుంటారో అనవసరమన్నారు. ‘‘అలాంటివి నేను పట్టించుకోను. నాకు నచ్చినట్టు ఉండటానికి ఇష్టపడతా’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.


Updated : 8 Sept 2023 7:02 PM IST
Tags:    
Next Story
Share it
Top