Home > సినిమా > నిహారిక ప్రేమలో హైపర్ ఆది..త్వరలోనే పెళ్లికి రెడీ ..

నిహారిక ప్రేమలో హైపర్ ఆది..త్వరలోనే పెళ్లికి రెడీ ..

నిహారిక ప్రేమలో హైపర్ ఆది..త్వరలోనే పెళ్లికి రెడీ ..
X

జబర్దస్త్ కామెడీ షో ఎంతోమంది కమెడియన్స్‎కి లైఫ్ ఇచ్చింది. ఈ షో ద్వారా పలువురు వర్ధమాన కమెడియన్స్ తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో హైపర్ ఆది ఒకరు. స్పూఫ్ వీడియోలతో సామజిక మాధ్యమాల్లో కొంత ఫెమ్ సొంతం చేసుకున్నఆది..ఆ తర్వాత అదిరే అభి టీమ్ ద్వారా జబర్దస్త్‏లోకి ఎంట్రీ ఇచ్చి .. క్రమంగా టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత ఎన్నో షోస్‎లో అవకాశాలు అందుకుంటూ బుల్లితెరపై స్టార్డమ్ సంపాదించుకుని వెండితెరపై కూడా వెలిగిపోతున్నాడు. ముఖ్యంగా జబర్డస్త్ కామెడీ షో చరిత్రలోనే హైపర్ ఆదిలా ఒంటి చేత్తో స్కిట్లను నడిపించిన వారు చాలా తక్కువ అనే చెప్పవచ్చు. అంతేకాదు, తక్కువ సమయంలోనే ఎక్కువ ఎపిసోడ్స్ గెలుపొందిన టీమ్ లీడర్‌‌గా ఆదికి అద్భుతమైన రికార్డు కూడా ఉంది. మొత్తంగా ఈ షోతో ఆది సెన్సేషన్‌గా మారిపోయాడు.

హైపర్ ఆది ప్రస్తుతం టీవీ షోలు, సినిమాల్లో నటిస్తూ కెరీర్‎లో మంచి పొజిషన్‎లో ఉన్నాడు. కాగా జబర్దస్త్‎లో సుడిగాలి సుధీర్, ఆది పెళ్లి విషయంపై తరచూ చర్చలు సాగుతూ ఉంటాయి .వారిద్దరూ మాత్రం ఇప్పటివరకు ఆ మాట బయట పెట్టడంలేదు. అయితే ఈ సైలెన్స్ కి ఆది బ్రేక్ వేసినట్లు తాజాగా తెలుస్తుంది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ఆది తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. హైపర్ ఆది తన ప్రియురాలిని పరిచయం చేశాడు. స్క్రిప్ట్‎లో భాగంగా ఇప్పటికి చాలామందికి లైన్ వేసి, ప్రపోజ్ చేశాను . కానీ నేను నిజంగా ప్రేమించిన అమ్మాయి ఒకరు ఉన్నారు అంటూ తన ప్రేయసిని పరిచయం చేశాడు . బేబీ ఒక్కసారి స్టేజ్‌ పైకి రా అంటూ ఆది పిలవగానే..ఆ అమ్మాయి నవ్వులు చిందిస్తూ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఆమె పేరు నిహారిక. అదే స్టేజిపై ఆది నిహారికకు ఐ లవ్‌ యూ అంటూ ప్రపోజ్‌ చేశాడు. ఆ తరువాత ఆమె బుగ్గలను ముద్దాడాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసిన కొంతమంది నెటిజెన్స్.. ఇది కూడా స్క్రిప్ట్ లో భాగమే అయ్యి ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. ఆమెను ఏ టీవీ షోల్లో చూడలేదు. నిజంగా ఆమె ఆది ప్రియురాలే అయ్యి ఉంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఆది బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా తన హవాను కొనసాగిస్తున్నాడు. ఇందులో భాగంగానే జబర్దస్త్ సహా ఎన్నో షోలలో భాగం అవుతున్నాడు. అయితే, ఇప్పుడు మాత్రం అతడు బిజీ షెడ్యూల్ కారణంగా షోలకు గ్యాప్ తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే జబర్ధస్త్‌కు అతడు గ్యాప్ తీసుకున్నాడు. కానీ, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ రెండు షోలలోనే భాగం అవుతున్నాడు. అలాగే జనసేన కార్యక్రమాల్లోనూ బిజీగా ఉంటున్నాడు. ఆ పార్టీ తరపున అయన పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్టు ప్రచారం సాగుతుంది. ఇక ఇటీవల భోళా శంకర్ ఈవెంట్‎లో ఆది స్పీచ్ వైరల్ అయింది. అలా మెగా అభిమానాన్ని చాటుకుంటున్న ఆది త్వరలోనే పెళ్లి పీఠాలు ఎక్కనున్నట్టు తెలుస్తుంది .


Updated : 17 Aug 2023 10:25 PM IST
Tags:    
Next Story
Share it
Top