ఎట్టకేలకు కాబోయే భార్యపై సుధీర్ క్లారిటీ ..!
X
జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు రాష్ట్రాల్లో కమెడియన్‌గా పాపులారిటీ సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. ఆ తరవాత టీవీ హోస్ట్‌గా కూడా మెప్పించాడు. బుల్లితెరపై సత్తా చాటుతూనే.. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ అలరిస్తున్నాడు. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమా ద్వారా హీరోగా వెండితెరకు మొదటిసారి పరిచయం అయ్యాడు. దీనితో పాటు ఒకటి రెండు సినిమాలు చేసినా అవి ఆశించిన విజయాలు అందలేదు. ఇదే సమయంలో గాలోడు సినిమాతో మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు గోట్ అనే మరో సినిమాతో సుధీర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీలో దివ్య భారతి హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో సుధీర్ బిజీగా ఉన్నాడు. దీంతో సుధీర్ ఎక్కడ కనిపించినా మీడియా రెండు ప్రశ్నలు మాత్రం తప్పనిసరిగా అడుగుతుంది .అందులో ఒకటి రష్మీ , రెండోది పెళ్లి .. తాజాగా కూడా సుధీర్‌కి ఈ ప్రశ్నలు ఎదురయ్యాయి . వీటికి తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చాడు.
సుధీర్, రష్మీలు వివాహం చేసుకుంటారా అన్న ప్రశ్న సుధీర్‌కు ఎదురవగా.. తాము మంచి స్నేహితులం మాత్రమే అని తెలిపాడు.మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నారు అని ఒకరు ప్రశ్నించగా.." పెళ్లి చేసుకోవాలనుకున్న వారికి మాత్రమే తనకు కాబోయే భార్యలో ఎలాంటి లక్షణాలు ఉండాలో ఆలోచించుకుంటారు. అయితే నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు. ఒకవేళ చేసుకోవాల్సిన సమయం వస్తే మాత్రం అమ్మాయి ఎప్పుడు చాలా కూల్‌గా, సంతోషంగా, అందరితో కలిసిపోయేలా ఉంటే చాలు అని అనుకుంటా. అంతకుమించి ఎటువంటి లక్షణాలు అవసరం లేదు" అని క్లారిటీ ఇచ్చాడు.
ఇక గొట్ మూవీ నుంచి ఇప్పటికే ఓ గ్లింప్స్ వీడియో రిలీజ్ అయింది. యూట్యూబ్‌లో ఈ గ్లింప్స్ చూసిన సుధీర్ అభిమానులు హిట్ గ్యారంటీ అంటున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. .ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా చాలా రిచ్‌గా చిత్రాన్ని తెరకెక్కించామని నిర్మాత తెలిపారు. టెక్నికల్‌గా కూడా చిత్రం ఉన్నత స్థాయిలో ఉంటుందన్నారు. సుడిగాలి సుధీర్ కెరీర్‌లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది అని చెప్పారు. దీనితో సుధీర్ అభిమానులు మూవీ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.