‘జైలర్’ సరికొత్త రికార్డ్.. తొలి ఇండియన్ సినిమాగా..
X
నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమా జైలర్ కలెక్షన్ల సునామీని సృష్టించింది. తన డైలాగ్స్, స్టైల్, స్వాగ్ తో రజనీ రికార్డులన్నీ కొల్లగొడుతున్నాడు. ఆగస్ట్ 10 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో రూ.525 కోట్లకు (గ్రాస్) పైగా వసూలు చేసింది. ప్రస్తుతం మరో కొత్త రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది.
సౌత్ ఇండియాలోని 4 మార్కెట్లలో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక) రూ.50 కోట్ల క్లబ్ లో చేరింది. నాన్ సీక్వేల్ సినిమా అన్ని ప్రాంతాల్లో కలిపి రూ.50 కోట్లు చొప్పున కలెక్షన్లు సాధించిన తొలి భారత సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. గతంలో సీక్వెల్ సినిమాలు కేజీఎఫ్-2, బాహుబలి-2లు మాత్రమే ఈ ఘనతను సాధించాయి. కాగా, జైలర్ కు సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ నెల్సన్ చాలా సందర్బాల్లో ప్రకటించాడు. దీంతో మరోసారి తలైవాను పవర్ ఫుల్ పాత్రలో చూడొచ్చని అభిమానులు ఖుష్ అవుతున్నారు.