Jailer collections: విక్రమ్ రికార్డ్కు 6 రోజుల్లోనే బ్రేక్.. కలెక్షన్స్ ఎంతంటే..?
Mic Tv Desk | 16 Aug 2023 4:31 PM IST
X
X
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘జైలర్’. తమన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఆగస్టు 10న థియేటర్లలోకి వచ్చింది. మొదటి షోతోనే హిట్ టాక్ సొంతం చేసుకున్న జైలర్.. కలెక్షన్లలో దూసుకుపోతోంది. 4 రోజుల్లోనే రూ.350కోట్లు రాబట్టిన ఈ మూవీ.. రూ.500 క్లబ్ లో చేరడం ఖాయమన్న టాక్ వినిపించింది. అన్ని భాషల్లో దూసుకుపోతున్న ఈ సినిమా.. విశ్వ నటుడు కమల్ హసన్ నటించిన ‘విక్రమ్’ కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేసింది.
‘విక్రమ్’ లైఫ్ టైం గ్రాస్ రూ.410.25 కోట్లు కాగా.. ఈ మొత్తాన్ని జైలర్ కేవలం 6 రోజుల్లోనే క్రాస్ చేసింది. జైలర్ సినిమా ఇప్పటివరకూ అన్ని భాషల్లో కలిపి రూ.416.19 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇదే ఊపు కొనసాగితే ఈ సినిమా అన్ని రికార్డులను బ్రేక్ చేయొచ్చని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Updated : 16 Aug 2023 4:31 PM IST
Tags: Jailer Vikram collections Jailer collections Vikram collections rajinikanth kamal hasan cinema news movie news entertainment
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire