Home > సినిమా > ఇప్పటికి 600 కోట్లు...ఇంకా కొల్లగొడుతూనే ఉన్న జైలర్

ఇప్పటికి 600 కోట్లు...ఇంకా కొల్లగొడుతూనే ఉన్న జైలర్

ఇప్పటికి 600 కోట్లు...ఇంకా కొల్లగొడుతూనే ఉన్న జైలర్
X



జైలర్ సినిమా ప్రభంజనం మామూలుగా లేదు. రిలీజ్ అయిన రోజునే దాదాపు వంద కోట్లు రాబట్టిన ఈ మూవీ...మూడు రోజుల్లో 200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆగస్టు 10న రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది.

తమిళంలో జైలర్ సినిమాలో ఎలాగో సూపర్ హిట్. అయితే అక్కడ ఒక్కచోటే కాదు మిగతా సౌత్ ఇండియన్ భాషల్లో కూడా దీనికి అడ్డు లేకుండా పోయింది. ఇదే టైమ్ లో విడుదల అయిన భోళా శంకర్ అట్టర్ ఫ్లాప్ అవడంతో తెలుగు ప్రజలు కూడా జైలర్ సినిమానే చూస్తున్నారు. రజనీ కాంత్ ర్యాంపేజ్ కొనసాగుతోంది. మొదటి ఆరు రోజుల్లో 400 కోట్లకు పైగా వసూళ్ళను రాబట్టి...ఫాస్టెస్ట్ 400 కోట్ల క్లబ్ లో చేరిన తమిళ సినిమాల్లో ఒకటిగా నిలిచింది జైలర్. రోబో 2.0 తర్వాత అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రెండ స్థానంలో ఉంది.

ఇప్పటికే 580 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన జైలర్ మూవీ ఈ వీకెండ్ ముగిసేసరికి 600 కోట్ల మార్క్ ను టచ్ చేస్తుందని సినీ ట్రేడ్ అంచనా. ఇదే కనుక జరిగితే జైలర్ సినిమా ఓ రేంజ్ లో ఉంటుంది. దీన్ని వేరే ఏ సినిమా అయినా అందుకోవడం ఇప్పట్లో జరగదని అంటున్నారు. దీంతో రజనీ కాంత్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే గత కొన్నేళ్ళుగా రజనీ ట్రెండింగ్ లో ఏం లేరు. ఆయన సరైన హిట్ కొట్టి చాలా ఏళ్ళే అవుతోంది. అంతేకాదు జైలర్ మూవీకి ప్రమోషన్స్ కూడా పెద్దగా ఏం చేయలేదు. రజనీ కూడా పెద్దగా ప్రమోషన్స్ లో ఏం పాల్గొన్నట్టు కనిపించలేదు. అయినా సరే ఈ సినిమాను నెత్తిమీద పెట్టుకున్నారు సినీ అభిమానులు. రజనీకాంత్ సత్తా ఏంటో నిరూపించారు.


Updated : 25 Aug 2023 2:55 PM IST
Tags:    
Next Story
Share it
Top