Home > సినిమా > రజనీకాంతా...మజాకానా, రికార్డ్ ల మోత మోగాల్సిందే

రజనీకాంతా...మజాకానా, రికార్డ్ ల మోత మోగాల్సిందే

రజనీకాంతా...మజాకానా, రికార్డ్ ల మోత మోగాల్సిందే
X

రజనీకాంత్ జైలర్ సినిమా విడుదలకు ముందే దుమ్ములేపుతోంది. ఇప్పటికే జైల్ విడుదల సందర్భంగా రెండు రాష్ట్రాలు హాలిడే ప్రకటించాయి. మరోవైపు ప్రీబుకింగ్స్ లో అత్యధిక ప్రీసేల్స్ రాబట్టి హిస్టరీ క్రియేట్ చేస్తోంది.

జైలర్ సినిమా కొన్ని రోజులుగా అందరినీ కమ్మేసింది. కావాలయ్యా పాటను రిలీజ్ చేసిన దగ్గర నుంచీ ఈ సినిమా గురించి ఎదురు చూపులు ఎక్కువ అయ్యాయి. అందులో రజనీకాంత్ హిట్ కొట్టి చాలా ఏళ్ళఉ అవుతోంది. ఒక పవర్ ఫుల్ ఫ్యాక్ సినిమాలో సూపర్ స్టార్ ను చూడాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో కలలు కంటున్నారు. అది జైలర్ సినిమాతో ఇన్నాళ్ళకు నెరవేరబోతుండడంతో ఈ సినిమా సెన్సేషన్ సృష్టించేట్టు కనబడుతోంది. అది ప్రీ బుకింగ్స్ లోనే కనిపిస్తోంది. ఓవర్సీస్ లో జైలర్ సినిమా వన్ మిలియన్ కలెక్ట్ చేసి కబాలి తర్వాత అతి ఎక్కువ ప్రీసేల్స్ రాబట్టిన సినిమాగా హిస్టరీ క్రియేట్ చేస్తోంది జైలర్.

అలాగే బుక్ మై షో ఆప్ లో కూడా వన్ మిలియన్ టికెట్స్ ఇప్పటికే బుక్ అయ్యాయి. బెంగళూరులో జైలర్ మూవీకి కేజీఎఫ్ 2 కన్నా ఎక్కువ థియేటర్లు కేటాయించారు. కర్నాటకలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని సెన్సేణ్ చూడబోతున్నామని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కోలీవుడం లో కూడా డే వన్ హయ్యెస్ట్ గ్రాసర్ గా జైలర్ నిలుస్తుందని బుకింగ్స్ చేస్తే అర్ధమైపోతోంది.

మూవీ దర్శకుడు జైలర్ ప్రమోషన్స్ మొదలుపెట్టి కరెక్ట్ గా వారం అవుతోంది. అయినా కూడా ఈ సినిమా మీద హైప్ ఒక రేంజ్ లో ఉంది. 72 ఏళ్ళ వయసులో ఒక స్టార్ ఇంతటి సంచలనాన్ని సృష్టించడం ఒక్క భారతదేశంలోనే అది కూడా రజనీ వల్లనే అవుతుంది అంటున్నారు సినీ పండితులు. నిజం చెప్పాలంటే రజనీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పదేళ్ళు అవుతోంది. అయినా కూడా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇక మూవీ రేపు రిలీజ్ అవడమే ఆలస్యం. దాంతో మరెన్ని రికార్డులు బద్దలు అవుతాయో చూడాలి. అందరి అంచనాలను నిజం చేస్తూ జైలర్ మూవీ హిట్ కొడుతుందా లేదా అనేది మరో 24 గంటల్లో తెలిసిపోతుంది.



Updated : 9 Aug 2023 11:54 AM IST
Tags:    
Next Story
Share it
Top