పవన్ కళ్యాణ్ విడాకులపై జనసేన క్లారిటీ..!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మూడో భార్య అన్నాలెజ్ నోవాతో విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. పవన్‌తో మనస్పర్థలు కారణంగా అన్నాలెజ్ నోవా సింగపూర్‌కు మకాం మార్చారని..పిల్లలతో అక్కడే ఉంటున్నారని రూమర్స్ వచ్చాయి. ఈ పుకార్లకు జనసేన చెక్ పెట్టింది. పవన్ సతీసమేతంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోని షేర్ చేసి వదంతులపై క్లారిటీ ఇచ్చింది.
పవన్ ఇటీవల చేపట్టిన వారాహి యాత్ర విజయవంతమైంది. తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో పూజా కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్, అనా కొణిదెల దంపతులు నిర్వర్తించినట్లు జనసేన ట్వీట్ చేసింది.
" జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు - వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో మంగళగిరి చేరుకుంటారు" అని ట్విట్టర్లో రాసుకొచ్చారు. వారి ఫోటోలు కూడా షేర్ చేయడంతో అవాస్తవ ప్రచారానికి బ్రేక్ పడింది.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు - వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా… pic.twitter.com/x3WJ5iUtQv
— JanaSena Party (@JanaSenaParty) July 5, ౨౦౨౩