ఆర్‌సీ16లో శ్రీదేవి కూతురు.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
X
దివంగత అందాల తార శ్రీదేవి గారాలపట్టిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి జాన్వీ కపూర్.. చాలా తక్కువ టైంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ ప్రస్తుతం సౌతిండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఎన్టీఆర్ జోడీగా ‘దేవర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుండగా.. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా దేవర షూటింగ్‌లో ఉండగానే జాన్వీ మరో తెలుగు సినిమాకు ఒకే చెప్పింది.
ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. దీనికి ‘ఆర్‌సీ16’ అనే వర్కింగ్ టైటిల్ ను కన్ఫార్మ్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ కలసి నిర్మించనున్నాయి. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా కథ ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం నటీనటుల ఆడిషన్స్ జరుగుతుంది. ఈ క్రమంలో మేకర్స్ సినిమా కథానాయికను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా జాన్వీకపూర్ ఖరారైంది. ఈ విషయాన్ని జాన్వీకపూర్ తండ్రి బోనీకపూర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
‘ఎన్టీఆర్ ‘దేవర’లో నటిస్తోన్న జాన్వీ.. బుచ్చిబాబు ప్రాజెక్ట్ పై కూడా సంతకం చేసింది. త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటుంది. ఎన్టీఆర్, చరణ్‌లు తెలుగులో పెద్ద స్టార్స్. వారి పక్కన నటించడానికి తన నటన, భాషను డెవలప్ చేసుకునేందుకు తెలుగు సినిమాలు చూస్తుంది. ‘దేవర’, ‘ఆర్‌సీ16’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టాలని కోరుకుంటున్నా. సూర్యతో కూడా తమిళంలో మరో సినిమా రెడీగా ఉంది’ అని బోనీకపూర్ చెప్పుకొచ్చారు.
And She Soon going to Start Film With #RamCharan 😊❤ Actress #Jahnvikapoor Roped In for #RC16 as Female Lead ✅🔥💥
— 𝐀𝐤𝐚𝐬𝐡𝐡 𝐑𝐂™ (@AlwaysAkashRC) February 18, 2024
:- @BoneyKapoor @AlwaysRamCharan 🦁👑 #RamCharanRevolts pic.twitter.com/O6Cjq59Af2