Home > సినిమా > అరె వాహ్...ఏమన్నా చేశారా...అదిరిపోయిందిగా

అరె వాహ్...ఏమన్నా చేశారా...అదిరిపోయిందిగా

అరె వాహ్...ఏమన్నా చేశారా...అదిరిపోయిందిగా
X

జపాన్ లో రజనీకాంత్ కు విరపీతంగా అభిమానులు ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈయన అభిమానం వేరే లెవల్. అది కూడా ఒక ప్రత్యేకమైన హోదా లో ఉండి మరీ తాను రజనీకి ఎంత హార్డ్ కోర్ ఫ్యానో చూపిస్తున్నారు. జైలర్ సినిమా హిట్ అయినందుకు అభినందనలు చెబుతూ జపాన్ రాయబారి హిరోషి సుజుకి ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇప్పుడు అది వైరల్ అవుతోంది.

రజనీ స్టైల్ ను అనుకరిస్తూ కళ్ళజోడు తిప్పేందుకు ప్రయత్నించారు సుజుకి. మొదటిసారి ట్రై చేసినప్పుడు రాలేదు. దాంతో వేరే అతని దగ్గర కళ్ళజోడు ఎలా తిప్పాలో నేర్చుకున్నారు. తర్వాత మళ్ళీ రజనీ స్టైల్లోనే స్పెక్ట్స్ పెట్టుకుని రజనీ సార్ మీకు సూపర్. జైలర్ సూపర్ మిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ రజనీ కాంత్ ని విష్ చేశారు. దాంతో పాటూ జపాన్ వాళ్ళు ఆయనను ఎంతగా ప్రేమిస్తారో చెప్పారు.





సుజుకి పెట్టిన వీడియో చాలా ఫేమస్ అయిపోయింది. రజనీ ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ సరక్క్యులేట్ చేస్తున్నారు. సుజుకి సర్ మీరు చాలా కూల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన జైలర్ మూవీ రెండు రోజుల క్రితం విడుదల అయి హిట్ టాక్ తో నడుస్తోంది. అత్యధిక వసూళ్ళు చేస్తున్నట్టు సమాచారం.


Updated : 12 Aug 2023 5:33 PM IST
Tags:    
Next Story
Share it
Top