jawan movie First Day First Show.. "భారత్ కీ షాన్, షారుఖ్ ఖాన్" అంటూ ర్యాలీ
X
‘పఠాన్’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘జవాన్’. భారీ అంచనాల మధ్య ఈరోజే విడుదలైన ఈ సినిమా ఇప్పటికే హిట్ టాక్ ను తెచ్చుకుంది. సోషల్ మీడియాలో షారుఖ్ ఖాన్ యాక్టింగ్ నెక్ట్స్ లెవల్ అంటూ మూవీ లవర్స్ ట్వీట్ చేస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి ఇతర కీలక పాత్రలు పోషించారు.
ఇక ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు షారుఖ్ అభిమానులు ఎగబడుతున్నారు. కొన్ని చోట్ల థియేటర్ల వద్ద ఇప్పటికే జవాన్ బెనిఫిట్ షో పూర్తి కాగా.. సినిమా గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ టపాసులు పేల్చుతున్నారు. ముంబైలోని ఐకానిక్ గైటీ గెలాక్సీ థియేటర్ వద్ద కొంతమంది ఫ్యాన్స్.. జవాన్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ర్యాలీగా తరలివచ్చారు. జవాన్ బ్యానర్లతో థియేటర్ వద్ద
"వి లవ్ షారుఖ్ ఖాన్" మరియు "భారత్ కీ షాన్, షారుఖ్ ఖాన్" వంటి నినాదాలు చేస్తూ మిగతా ఫ్యాన్స్‌లో జోష్ పెంచారు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా దీనిపై తాజాగా హీరో షారుఖ్ స్పందించారు.
అభిమానులు తనపై కురిపించిన ప్రేమకు ఫిదా అయ్యారు. ఈ మేరకు ఆ వీడియోకు రీట్వీట్ చేస్తూ.. "డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్.. సినిమాను థియేటర్లలో బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. సినిమా చూసేందుకు మెలకువగా ఉండి థియేటర్‌కు వెళ్లారు. మీ ప్రేమకు ధన్యవాదాలు" అని పోస్ట్ చేశాడు సూపర్ స్టార్ .