Home > సినిమా > Jawan Twitter Review: జవాన్.. షారుఖ్ ఫెర్పార్మెన్స్ నెక్ట్స్ లెవెల్

Jawan Twitter Review: జవాన్.. షారుఖ్ ఫెర్పార్మెన్స్ నెక్ట్స్ లెవెల్

Jawan Twitter Review: జవాన్.. షారుఖ్ ఫెర్పార్మెన్స్ నెక్ట్స్ లెవెల్
X

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రూపొందిన క్రేజీ యాక్షన్ ఫిల్మ్ జవాన్ ఈ రోజు(సెప్టెంబర్ 7న) ప్రేక్షకుల మందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ కొన్ని గంటల క్రితమే హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల అయింది. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ... సూపర్ హిట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. షారుఖ్ ఖాన్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీ.. అంటూ మెసేజ్‌లు చేస్తున్నారు. అయితే ఇండియాలో కంటే ఓవర్సీస్‌లో ముందుగానే ప్రీమియర్లు ప్రారంభమయ్యాయి. సినిమా చూసిన మూవీ లవర్స్ అంతా.. షారుఖ్ ను ఆకాశానికెత్తేస్తున్నారు. జవాన్ షారుఖ్ కేరీర్‌లోనే ది బెస్ట్ మూవీ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.





జవాన్ మూవీ సూపర్ మూవీ. వాటే మూవీ. స్క్రీన్ మీద షారుఖ్ ఖాన్ నటన విస్పోటనంగా ఉంది. కథ అద్బుతంగా ఉంది. షారుఖ్ ఫెర్పార్మెన్స్ నెక్ట్స్ లెవెల్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. జవాన్ మూవీ బాగుంది. అవుట్ స్టాండింగ్, అన్ బిలీవబుల్. బాలీవుడ్ తెర మీద ఇలాంటి సినిమాను ఇప్పటి వరకు చూడలేదు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. జవాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద సునామీ క్రియేట్ చేయడం గ్యారెంటీ. తొలి రోజు రికార్డుల క్రియేట్ చేస్తుంది. మాస్ అవతార్‌లో ఇండియాలోని బిగ్గెస్ట్ సూపర్ స్టార్ సినిమా అంటే ఎలా ఉంటుందో అలా చూపించాడు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.





మాస్ పాన్ ఇండియా మూవీ అంటే ఎలా ఉండాలో అలాంటి సినిమాను అట్లీ ఇచ్చాడు. కింగ్ సైజ్‌డ్ ఎంటర్‌టైనర్ సినిమాను అందించాడు. జవాన్ తప్పకుండా చూడండి. జవాన్ రిలీజ్‌కు ముందే హిస్టరీ క్రియేట్ చేసింది. జవాన్ 557K వసూలు చేసింది. కింగ్ ఖాన్ హవా అంటే ఇది అని జవాన్ కలెక్షన్ల గురించి ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు.

జవాన్ సినిమా చూసే ప్రేక్షకులు ఎలాంటి వీడియోలు ఫోటోలు పెట్టకండి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. షారుక్ ఖాన్ బ్రిల్లియంట్. నయనతార క్యారెక్టర్ అద్బుతంగా ఉంది. గ్లోబల్ బ్లాక్ బస్టర్ సినిమా జవాన్ అని నెటిజన్ కామెంట్ చేశాడు. విజయ్ సేతుపతి, యోగిబాబు తదితరులు నటించిన ఈ చిత్రంలో దీపిక పదుకోన్ కీలక పాత్రల్లో ఈ చిత్రంలో నటించారు.




Updated : 7 Sept 2023 7:44 AM IST
Tags:    
Next Story
Share it
Top