Madras High Court: జయప్రదకు హైకోర్టులో చుక్కెదురు.. కోర్టులో లొంగిపోవాలని ఉత్తర్వులు
X
సినీ నటి జయప్రదకు మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. జైలు శిక్ష రద్దు చేయాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్ట్ కొట్టేసింది. 15 రోజుల్లోగా కోర్టులో లొంగిపోవాలని, రూ.20 లక్షలు డిపాజిట్ చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గతంలో జయప్రద చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజ్ బాబులతో కలిసి అన్నాసాలైలో ఓ సినిమా థియేటర్ నడిపారు. అందులో పనిచేసే సిబ్బందికి రూ.37.68 లక్షల ఈఎస్ఐ చెల్లించలేదు. దీంతో సిబ్బంది ఎగ్మూర్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారించిన కోర్టు జయప్రదతో పాటు మరో ముగ్గిరికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధించింది. ఈ క్రమంలో ఆమె జైలు శిక్ష రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారించిన ధర్మాసనం.. ఈఎస్ఐ చెల్లించడం కుదురుతుందా లేదా అని ప్రశ్నించింది. దానిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలో రూ.20 లక్షలు చెల్లిస్తామని కోర్టుకు వివరించారు జయప్రద. దీన్నీ ఈఎస్ఐ తరుపు న్యాయవాది వ్యతిరేకించారు. అనంతరం ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయముర్తి తీర్పునిచ్చారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.