Home > సినిమా > నిర్మాతను మోసం చేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్..?

నిర్మాతను మోసం చేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్..?

నిర్మాతను మోసం చేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్..?
X

ఓటీటీల్లో క్లీన్ కంటె హోమోసెక్స్, గే-లెస్బియానిజం ఎక్కువైపోయిందంటూ.. సంచల కామెంట్స్ చేసిన ప్రముఖ నటి అమీషా పటేల్... మళ్లీ వార్తల్లో నిలిచారు. చెక్ బౌన్స్ కేసులో జార్ఖండ్ లోని రాంచీ సివిల్ కోర్టుకు హాజరయ్యారు. . సినిమా తీస్తానంటూ తన వద్ద అమీషా పటేల్ రూ.2.50 కోట్లను అప్పుగా తీసుకుని, తన డబ్బు ఎగ్గొట్టారంటూ జార్ఖండ్‌కు చెందిన అజయ్​ కుమార్ సింగ్​​ అనే నిర్మాత ఆమెపై కేసు వేశారు. మోసం, చెక్​ బౌన్స్​ వంటి ఆరోపణలు మోపారు. తన డబ్బు తనకు తిరిగి ఇప్పించాలని కోరారు. 2018 నాటి కేసుకు సంబంధించి ఆమె గత నెల 18 వ తేదీనే కోర్టు ఎదుట లొంగిపోయారు.

పిటిషనర్ ప్రకారం.. 'దేశీ మ్యాజిక్' అనే సినిమా కోసం అజయ్ కుమార్.. అమీషా పటెల్ కు రూ.2.5 కోట్లు ట్రాన్సఫర్ చేశారు. అయితే సినిమాని తీయకపోవడంతో.. తన డబ్బు తనకివ్వాలని కోరగా .. రూ.2.5 కోట్ల చెక్కు ఇచ్చారని, కానీ అది బ్యాంకులో క్లియర్ కాలేదని ఆరోపించారు. ఇక విచారణ ప్రకారం.. ఆమెను జూన్ 21న హాజరు కావాల్సిందిగా కోరామని, అయితే ఆమెకు వేరే పనులు ఉండటం వల్ల హాజరు కాలేదని అజయ్ కుమార్ లాయర్ స్మితా పాఠక్ అన్నారు. తదుపరి విచారణలో భాగంగా సోమవారం కోర్టుకు హాజరైన అమీషా.. తాను నిర్ధోషనని సీనియర్ డివిజన్ జడ్జి డిఎన్ శుక్లా ముందు తెలిపారు.

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన 'బద్రి' సినిమాలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు అమీషా పటేల్. ఆ తర్వాత మహేశ్ బాబు, ఎన్టీఆర్ సినిమాల్లోనూ నటించినా పెద్ద బ్రేక్ రాలేదు. తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయకపోయినా బాలీవుడ్‌లో మాత్రం మూడు, నాలుగేళ్లు ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసింది. ఆ తర్వాత సడెన్‌గా ఆమె కెరీర్‌ స్లో అయిపోయింది. ఒకానొక దశలో సినిమా సినిమాకు దాదాపు రెండు, మూడేళ్లు గ్యాప్‌ తీసుకుంది. చివరిగా ఈమె 2018లో వచ్చిన భయ్యాజీ సూపర్‌ హిట్ సినిమాలో కనిపించింది. ఇక ఇప్పుడు మళ్లీ ఐదేళ్ల తర్వాత గదర్‌-2తో రీ ఎంట్రీ ఇస్తుంది.




Updated : 11 July 2023 8:01 AM IST
Tags:    
Next Story
Share it
Top