జితేందర్ రెడ్డి మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్
X
బాహుబలితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాకేష్ వర్రె. తర్వాత అతను ‘ఎవరికీ చెప్పొద్దు’చిత్రంతో హీరోగా, నిర్మాతగా మారాడు. ప్రస్తుతం నిర్మాతగానే ‘పేక మేడలు’ సినిమా రూపొందిస్తున్నాడు. కొత్త కథలతోనే ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటోన్న రాకేష్ వర్రె లేటెస్ట్ మూవీ ‘జితేందర్ రెడ్డి’. ఈ మూవీ నుంచి గతంలో రిలీజ్ చేసిన ప్రోమోకి, అస్సలు ఎవరు ఈ జితేందర్ రెడ్డి అని ? అని హీరో పేస్ రెవీల్ చెయ్యకుండా విడుదల చేసిన పోస్టర్స్ కూడా మంచి ఆదరణ పొందాయి.. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ లో రాబోతున్న ఈ జితేందర్ రెడ్డి సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ఈరోజు విడుదల చేసింది. 2024 May 3న ఈ చిత్రం విడుదల కాబోతుంది అని చిత్ర దర్శకుడు విరించి వర్మ చెప్పారు.
ఈ సందర్భంగా దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా 1st లుక్ పోస్టర్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో ఎవరో చూపించకుండా విడుదల చేసిన పోస్టర్స్ కూడా మంచి క్యూరియాసిటీని పెంచాయి.. రాకేష్ వర్రే ఫ్యామిలీ హీరో గా ఎవ్వరికీ చెప్పొద్దూ లాంటి లవ్ స్టొరీని చేసినప్పటికీ ఇలాంటి ఒక ఆక్షన్ డ్రామా చెయ్యడం చాలా గొప్ప విషయం. ఈ జితేందర్ రెడ్డి జగిత్యాలలో 1980లలో యదార్ధంగా జరిగిన కథ. రియల్ స్టొరీని బాగా తియ్యడానికి చాలా రీసెర్చ్ అవసరమైంది, దాని కోసం నేను మా టీం వర్క్ ఔట్స్ చేసి, రెఫెరెన్సులు తీసుకుని, పెద్ద వారి సలహాలు తీసుకుని చాలా జెన్యూన్ గా చేసిన సినిమా ఇది.. మే 3న రిలీజ్ అయ్యే ఈ సినిమాతో ఆరోజుల్లో విలువలతో కూడిన ఈ పాత్ర, దాని చుట్టూ తిరిగే కథని ఈ తరం ప్రేక్షకులకి అందించాలని చేసే ప్రయత్నమే ఈ జితేందర్ రెడ్డి’.. అన్నాడు.
ముదుగంటి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఉయ్యాలా జంపాలా, మజ్ను లాంటి ప్రేమకథా చిత్రాలకు దర్శకత్వం వహించిన విరించి వర్మ, మా జితేందర్ రెడ్డి లాంటి యాక్షన్ స్టొరీని కూడా అద్భుతంగా తెరకెక్కించారు.. ఈ మూవీ పోస్టర్స్, గ్లిమ్స్ ను చాలా మంది అప్ప్రిషిఎట్ చేస్తున్నారు. జితేందర్ రెడ్డి అనే టైటిల్ చాలా పవర్ఫుల్ గా ఉంది. 1980లో నేను చూసిన, నాకు తెలిసిన కథ ఈ జితేందర్ రెడ్డి. అప్పటి లొకేషన్స్ గాని, అప్పటి అంబియన్స్ ని గాని చాలా చక్కగా తెరకేక్కించాము. మా హీరో రాకేష్ వర్రే గురంచి మీకు చెప్పాలి, గతంలో లవ్ స్టొరీ చేసి ఇప్పుడు ఈ యాక్షన్ డ్రామా ని కూడా చాలా బాగా హేండిల్ చేశాడు. తనకు సొంతంగా క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ ఉన్నప్పటికీ, తన సినిమాలే మూడు జరుగుతున్నప్పటికీ కూడా ఈ జితేందర్ రెడ్డిని తన సొంత ప్రాజెక్ట్ లాగా, తన సినిమాల పనులను అడ్జస్ట్ చేసుకుని చాలా శ్రమని ఈ సినిమా కోసం పెట్టారు. అప్పటి సన్నివేశాలని, జరిగిన కథని యదార్ధంగా చూపించాము తప్ప, ఎవరిని కించ పరిచే విధంగా మాత్రం చెయ్యలేదు. సుబ్బరాజు గారి లాంటి విలక్షణ నటులు కూడా మనసు పెట్టి అధ్బుతంగా ఈ కథ కోసం పని చేశారు. ఈసినిమాకి సంబధించిన updatesను మీకు ఇక నండి ఇస్తూ ఉంటాము, మేము మొదటి సారి సినిమా ఇండస్ట్రీ కి వచ్చి ఈ సినిమా చేస్తున్నాము, మమ్మల్ని ఆశీర్వదించండి.. ’ అన్నారు.
సాంకేతిక నిపుణులు విషయానికి వస్తే ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలకు (కంచే, NTR కథానాయకుడు, NTR మహానాయకుడు, IB 47) విషువల్స్ అందిచిన వి.ఎస్ జ్ఞాన శేఖర్ ఈ సినిమాకి కెమెరామెన్ గా పని చేశారు. అలాగే ఎన్నో లవ్ స్టోరీస్ కు మ్యూజికల్ హిట్స్ అందించిన మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్ జితేందర్ రెడ్డి సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నాగేంద్రకుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్‌పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.