Home > సినిమా > జోరుగా హుషారుగా.. ప్రతి ఒక్కరి జీవితానికి రిలేటయ్యే కథ - విరాజ్ అశ్విన్

జోరుగా హుషారుగా.. ప్రతి ఒక్కరి జీవితానికి రిలేటయ్యే కథ - విరాజ్ అశ్విన్

జోరుగా హుషారుగా.. ప్రతి ఒక్కరి జీవితానికి రిలేటయ్యే కథ - విరాజ్ అశ్విన్
X

విరాజ్‌ అశ్విన్‌ హీరోగా.. పూజిత పొన్నాడ కథానాయికదా రూపొందిన చిత్రం ‘జోరుగా హుషారుగా’. అనుప్రసాద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జోరుగా హుషారుగా హీరో విరాజ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ఆ సంగతులేంటో మీరు చదవండి.

రిపోర్టర్ : బేబీ సూపర్ హిట్టైన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి?

విరాజ్ : బేబీ సినిమా హిట్ అవుతుందని తెలుసు. కానీ ఇంత బ్లాక్ బస్టర్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ మూవీ విజయంతో ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ పెరిగింది. పర్సనల్ గా నాపై చాలా ఒత్తిడి ఉంది. బేబీ మూవీ తర్వాత సినిమాలు జాగ్రత్తగా ఎంచుకుంటున్నాను.

రిపోర్టర్: ఈ కథ సెలెక్ట్ చేసుకోడానికి కారణాలేంటి? ఈ స్టోరీ మీ దగ్గరికి ఎలా వచ్చింది?

విరాజ్ : నిజానికి జోరుగా హుషారుగా సినిమా బేబీ సినిమా కన్నా ముందే చేశాను. కానీ మూవీ రిలీజ్ కాలేదు. బేబీ సినిమా సూపర్ హిట్టవడంతో గేట్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మార్గం సుగమమైంది.

రిపోర్టర్: జోరుగా హుషారుగాలో మీ పాత్ర ఎలా ఉండనుంది.?

విరాజ్ : బేబీ మూవీలో నన్ను చూసిన తర్వాత చాలామంది అలానే ఓన్ చేసుకున్నారు. కానీ జోరుగా ఉషారుగాలో నా క్యారెక్టర్ భిన్నంగా ఉంటుంది. బేబీకి ఈ మూవీకి మధ్య చాలా తేడా ఉంది. బేబీలో రిచ్ లుక్లో కనిపించిన నేను ఈసారి మాత్రం పక్కా పల్లెటూరి అబ్బాయిలాగా మీ ముందుకు రానున్నాను.

రిపోర్టర్: కథపరంగా ఈ సినిమా ఎలా ఉంటుంది?

విరాజ్ : ఇదో కుటుంబ కథా చిత్రం. ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిలా నా క్యారెక్టర్ డిజైన్ చేశారు. సిటీకి వచ్చిన ఓ పల్లెటూరి అబ్బాయి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడన్న నేపథ్యంలో కథ కొనసాగుతుంది. ఎన్ని బాధలు, కష్టాలు ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ అందరితో సరదాగా ఉండే క్యారెక్టర్ నాది.

రిపోర్టర్ : మీతో పాటు ఈ సినిమాలో ఎవరెవరు నటించారు?

విరాజ్: తండ్రి క్యారెక్టర్ సాయి కుమార్ చేశారు. చేనేత కార్మికుడిగా చాలా చక్కగా నటించారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో తండ్రి పడే బాధ, కొడుక్కి ఎలా సపోర్ట్ చేయాలన్నదానిపై కథ నడుస్తుంది. నాకు జంటగా నటించిన పూజిత కూడా తన పాత్రకు న్యాయంచేసింది. రోహిణి, మధు నందన్, బ్రహ్మాజీ, సిరి హనుమంతు తమ పరిధి మేరకు బాగా నటించారు.

రిపోర్టర్: మీకు హీరోయిన్ పూజితకు మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది?

విరాజ్ : పూజిత తెలుగు అమ్మాయి. నాకన్నా ముందే ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సీనియర్ యాక్ట్రెస్ అయినా నాకు చాలా సపోర్ట్ చేసింది. మా జోడీ ఎలా ఉందో సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. నాకు తెలిసి అందరికీ మా జంట నచ్చుతుంది.

రిపోర్టర్ : మిమ్మల్ని చూస్తే గోల్డెన్ స్పూన్తో పెరిగినట్టు ఉంటుంది. మరి ఈ మీ పాత్రకి న్యాయం చేశారనుకుంటున్నారా?

విరాజ్ : చాలా మంది అలాగే అనుకుంటారు. అందుకే ఇలాంటి కథ ఎంచుకున్నాను. ఈ క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎప్పుడు ఒకే పాత్ర చేస్తూ పోతే మనకంటూ ఒక గుర్తింపు ఉండదు. అందుకే కథల విషయంలో పాత్ర విషయంలో ఎప్పుడు డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఉండాలి.

రిపోర్టర్: ఫస్ట్ టైం మీరు కథ విన్నప్పుడు ఏమనిపించింది..?

విరాజ్ : డైరెక్టర్ అను ప్రసాద్ కథ చెప్పినప్పుడు నా లైఫ్ లోనూ ఇలాంటి ఘటనలు బోలెడు జరిగాయని అనిపించింది. స్టోరీ బాగా కనెక్ట్ కావడంతో చేయాలని డిసైడైపోయా.

రిపోర్టర్: Hi నాన్న, యానిమల్ లాగే మీ సినిమా కూడా ఫాదర్ సెంటిమెంట్తోనే ఉంటుందా?

విరాజ్ : అదేంటో తెలీదు గానీ యాదృచ్ఛికంగా ఆ సినిమాల్లాగే మా మూవీ కూడా ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది. లైఫ్లో బిగ్గెస్ట్ అటాచ్మెంట్ ఎవరైనా ఉన్నారంటే అది నాన్నే. ప్రస్తుతం నాన్న - కొడుకు సీజన్ నడుస్తోంది అందుకే జోరుగా హుషారుగాను కూడా మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా.

రిపోర్టర్ : మీ రియల్ లైఫ్లో మీ నాన్న మీ హీరోనా?

విరాజ్ : మా డాడీ నాకు గొప్ప ఇన్స్పిరేషన్, ఏలూరులాంటి చిన్న టౌన్ నుంచి వచ్చి సైంటిస్ట్ గా ఎదిగారు. నా విషయానికి వస్తే స్కూల్, కాలేజీలో 100కి 100 మార్కులు తెచ్చుకో, బాగా చదవు. అదవ్వాలి.. ఇదవ్వాలని ఎప్పుడూ ఫోర్స్ చేయలేదు. నా ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకొని నన్ను సపోర్ట్ చేశారు. హీరో అవుతా అంటే 100% ఎఫర్ట్ పెడితేనే హీరోవు అవుతావు లేదంటే కాలేవు అని మోటివేట్ చేశారు.

రిపోర్టర్ : ఓన్లీ హీరోగానే చేస్తారా లేక సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఇచ్చినా చేస్తారా?

విరాజ్ : ప్రస్తుతానికి మెయిన్ లీడ్ చేయాలని అనుకుంటున్నాను, సపోర్టింగ్ క్యారెక్టర్స్ లేదా సెకండ్ హీరోగా చేస్తే ఆడియన్స్, ఇండస్ట్రీ ఇక నన్ను ఆ పాత్రకే పరిమితం చేస్తారు. సినిమాలో కథంతా నన్ను బేస్ చేసుకుని నా చుట్టూ తిరిగేలా ఉండేటట్టు చూసుకుంటున్నాను. మెయిన్ లీడ్ లేదా హీరోగా చేయాలన్నదే నా ఫ్యూచర్ ప్లాన్.

రిపోర్టర్: మల్టీ స్టారర్ ఛాన్స్ వస్తే చేస్తారా?

విరాజ్ : తప్పకుండా. నాకు కథ నచ్చితే ఎవరితోనైనా చేయడానికి రెడీగా ఉన్నాను. కానీ నా క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉండాలి.

రిపోర్టర్: మీరు వరుసగా రెండు సినిమాలు తెలుగు అమ్మాయిలతోనే చేశారు ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు అమ్మాయిలకి సపోర్ట్ చేస్తుందని మీకు అనిపిస్తుందా?

విరాజ్ : డెఫినెట్లీ. ఎందుకు చేయదు. చూశారుగా ఇప్పటికే చాలా మంది తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలోకి వచ్చారు. ఫ్యూచర్ లో తెలుగమ్మాయిలు ఇండస్ట్రీని ఏలుతారని అనిపిస్తుంది.

రిపోర్టర్ : ఈ సినిమా చేనేత కార్మికులను బేస్ చేసుకుని తీశారు అన్నారు కదా.. మల్లేశం సినిమాకి మీ మూవీకి పోలికలుంటాయా?

విరాజ్ : ఈ సినిమా చేనేత కార్మికులు బ్యాక్ డ్రాప్లో ఉంటుంది. అంతేతప్ప మల్లేశం సినిమాకి మా కథకి అసలు పొంతన ఉండదు. కాకపోతే కొన్ని సీనిస్, పాటలు మల్లేశం సినిమాలోలాగే చేనేత బ్యాక్ డ్యాప్లో కనిపిస్తుంది. డైరెక్టర్ ఫ్రెండ్ చేనేత కార్మికులు. వాళ్లని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా తీశారు.

రిపోర్టర్: మూవీలో చేనేత కార్మికులు, ఫాదర్ సెంటిమెంట్ కాకుండా ఇంకా ఏం హైలైట్ ఉంటాయా?

విరాజ్ : ఈ మూవీలో బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మధు నందన్ కాంబినేషన్లో సీన్స్ అదిరిపోతాయి. ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి సిటీకి వచ్చి సాఫ్ట్వేర్ జాబ్ లో చేరి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడన్నది థియేటర్లు చూడాలి. ఈ సినిమాకు ప్రణీత్ అందించిన మ్యూజిక్ ప్రతి సాంగ్ అన్ని ఏజ్ గ్రూపులకు నచ్చేలా చేస్తుంది. పిక్చరైజేషన్ కూడా సూపర్బ్ గా ఉంటాయి. హీరోయిన్ నాకు మధ్య మధ్య లవ్ స్టోరీ కూడా అందరికీ బాగా నచ్చుతుంది. డిసెంబర్ 15న రిలీజ్ కానున్న జోరుగా హుషారుగా మూవీని అందరూ థియేటర్లకు వెళ్లి చూడాలని కోరుకుంటున్నా.

Updated : 14 Dec 2023 12:29 PM IST
Tags:    
Next Story
Share it
Top