Home > సినిమా > ఆదిపురుష్ రావణుడిపై NTR కామెంట్స్.. ‘ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్’

ఆదిపురుష్ రావణుడిపై NTR కామెంట్స్.. ‘ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్’

ఆదిపురుష్ రావణుడిపై NTR కామెంట్స్.. ‘ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్’
X

భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైని ఆదిపురుష్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఆ అంచనాలను అందుకోలేకపోయింది. క్యారెక్టర్స్, డైలాగ్స్, టేకింగ్, విజువల్స్, మేకప్ లాంటి అంశాల్లో సినిమా అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, రామాయణాన్ని అవమానించారని కొంతమంది మండి పడుతున్నారు. ఇంకొంతమంది సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రావణుడి పాత్రను తెరపై చూపించడంపై తీవ్ర విమర్శలు చేశారు.

రావణుడికి విచిత్రమైన హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్ తో పాటు రెండు తలల్లో పది తలలను చూపించడం తానెక్కడా చూడలేదని మండిపడ్డారు. ‘నేను జై లవ కుశ సినిమాలో రావణుడి పాత్ర పోషించినప్పుడు రావణుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశా. దానికోసం ఆనంద్ నీలకంఠ రాసిన అసుర అనే పుస్తకాన్ని చదివా. దానిద్వారా రావణుడు 18 లోకాలకు రాజు, అసుర చక్రవతి అని గుర్తించా. అన్ని లోకాలకు అధిపతి అంటే ఆయనకు ఎంత నేర్పు ఉండాలి. ఆయన కళ్లు, శరీరం ఎంత గంభీరంగా కనపడాలి. రాముడు యుద్దం చేస్తున్నప్పుడు రావణుడిని చూడగానే.. ఇంత గొప్ప వ్యక్తివా నువ్వు అని అనుకుని.. ఆయనను పొగుడుతు పద్యం చెప్తాడు. అలా రావణుడు ఎక్కడైనా కనపడితే శత్రువు సైతం అతన్ని పొగిడేలా ఉండాలి. ఆ పాత్రను చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు ప్రేక్షకులకు కూడా అలా అనిపించాలి. ఈ విషయాలన్నీ నేర్చుకుని జై లవ కుశలో నటించా. ఆ పాత్రను ఆదరించారు’ అని అన్నాడు ఎన్టీఆర్.

‘ఒక సినిమాలో రావణుడిలా యాక్ట్ చేసేందుకే ఎన్టీఆర్ ఇంత తెలుసుకుంటే.. రామాయణంలో రావణుడిని చూపించే ఓం రౌత్ ఇంకెంత నేర్చుకుని ఉండాలి. ఆ పాత్రపై ఏలాంటి పరిశోధన చేయకుండా ఆ క్యారెక్టర్ ను అపహేలన చేశార’ని ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Updated : 24 Jun 2023 8:56 PM IST
Tags:    
Next Story
Share it
Top