Home > సినిమా > Jr NTR : ఆ సినిమా కోసం ఎన్టీఆర్ సాహసం..ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

Jr NTR : ఆ సినిమా కోసం ఎన్టీఆర్ సాహసం..ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

Jr NTR : ఆ సినిమా కోసం ఎన్టీఆర్ సాహసం..ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడుగా మంచి పేరు సంపాదించుకున్నాడు. తన నటనతో ఎందరో అభిమానుల మనసు దోచుకున్నాడు. ఇక గత ఏడాది విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ హీరోల జాబితాలో చోటు దక్కించుకున్నాడు జూనియర్. దేశంలోని టాప్ 5 అగ్ర హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు అనడంలో అతిశయోక్తి లేదు. ఆయన లైన్ అప్ కూడా అలానే ఉంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ వరుస ప్రాజెక్టులతో ఓ రేంజ్‎లో దూసుకెళ్తున్నాడు. స్టార్ డైరెక్టర్స్‏తో భారీ చిత్రాలను చేస్తున్నాడు.

ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివతో దేవర సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. నవంబర్ నాటికి మూవీలో ఎన్టీఆర్ సన్నివేశాలు పూర్తి కానున్నాయని తెలుస్తోంది. దేవరలో ఆరు భారీ ఫైట్స్, 500 మందితో కూడిన ఓ సాంగ్ ఉంటుందన్న టాక్ వినిపిస్తుంది . ఇక ఈ సాంగ్‎లో విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ సైతం ఉన్నట్లు సమాచారం. సినిమాలో సీజీ వర్క్ కూడా ఎక్కువగా ఉంటుందని, దానికి దాదాపు మూడు నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. అందుకే కొరటాల శరవేగంగా షూటింగ్ పనులు పూర్తి చేస్తున్నాడు. చెప్పినట్లుగానే 2024 సమ్మర్ బరిలో దేవరను నిలపేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్‏పై లేటెస్టుగా ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఎన్టీఆర్ భారీగా కండలు పెంచనున్నాడు. దీనికోసం అమెరికా లేదా దుబాయ్ వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అక్కడ స్పెషల్ ట్రైనర్స్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ ఈ మేకోవర్ వార్ 2 కోసమే అని తెలుస్తుంది . హృతిక్ రోషన్-ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న సినిమా వార్ 2 . ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానుంది. వార్ 2 ఫుల్ లెన్త్ యాక్షన్ మూవీ. ఈ సినిమాలో కండలు తిరిగిన విలన్స్‎తో పాటు బడా ఆయుధాలను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. వార్ సినిమాలో హృతిక్ కూడా ఈ మూవీ కోసం భారీ కండలను పెంచి అందరిని అలరించాడు. అందుకే వార్ 2లో గన్ షూటింగ్ సమయంలో ప్రత్యేకంగా చేతి కండరాలు కనిపించేలా ఎన్టీఆర్ మేకోవర్ ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ శిక్షణ తీసుకోనున్నాడని సమాచారం. ఈ మేరకు టాలీవుడ్‏లో ఈ వార్త జోరుగా చక్కర్లు కొడుతుంది. వార్ 2 చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్నాడు. ఆయన వార్, పఠాన్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. అలాంటి దర్శకుడు దర్శకత్వంలో వార్ 2 తెరకెక్కనుంది అంటే అంచానాలు భారీగానీ ఉంటాయి. అందులోనూ ఎన్టీఆర్ నటిస్తున్నాడంటే ఫ్యాన్స్‎కు పండగే. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.


Updated : 18 Aug 2023 4:04 PM IST
Tags:    
Next Story
Share it
Top