Home > సినిమా > Jr NTR : బాబాయితో విభేదాలు..? తారక్ అందుకే రాలేదా?

Jr NTR : బాబాయితో విభేదాలు..? తారక్ అందుకే రాలేదా?

Jr NTR : బాబాయితో విభేదాలు..? తారక్ అందుకే రాలేదా?
X

టీడీపీ వ్యవస్థాపకులు , దివంగత ముఖ్యమంత్రి , విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు.. నందమూరి తారక రామారావు స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ చీఫ్, ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరి , దగ్గుపాటి వెంకటేశ్వర్లు, నటుడు బాలకృష్ణ , నారా బ్రాహ్మణి, ఇతర ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అలాగే టీడీపీ ఎంపీలు కనకమేడల , గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, హాజరయ్యారు.. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‎లో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరికి రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందగా..దాదాపు అందరు హాజరయ్యారు.

ఇదిలా ఉంటే తాతగారి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఎట్టీఆర్ హాజరవుతాడా లేదా అని అందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూశారు. అయితే తారక్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి ఎన్టీఆర్ హాజరు కాలేదు. దీంతో తారక్‎పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలవడం ఇష్టం లేకనే ఎన్టీఆర్ హాజరు కాలేదా అనే చర్చలు సాగుతున్నాయి. తాతయ్యపై ప్రేమని చూపించే తారక్.. ఇంత ప్రతిష్టాత్మక వేడుకకి హాజరు కాకపోవడం ఏంటి అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. .అంతేకాక బాబాయితో విభేదాలు అనే వార్తలకి బలం ఇచ్చినట్టు అవుతుంది అనే వారు లేకపోలేదు.

జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్‏లో బిజీగా ఉన్నాడు. ఈ షూటింగ్ కారణంగానే తారక్ తాతగారి కార్యక్రమానికి రాలేకపోయాడనే వార్తలు వినిసిస్తున్నాయి. అయితే యంగ్ టైగర్ తలుచుకుంటే షూటింగ్‎కు ఒకరోజు బ్రేక్ వేయడం పెద్ద విషయం కాదు. తాతగారి ప్రతిష్టాత్మక కార్యక్రమం కన్నా షూటింగ్ ముఖ్యమా అన్న విమర్శలు వస్తున్నాయి. నందమూరి కుటుంబ సభ్యులతో కలసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఉంటే ఎంత బావుండేది. ఫ్యామిలీ ఒక్కటే అనే సంకేతాలు ఇచ్చినట్టు ఉండేది. అయితే ఈ విషయంలో తారక్ అభిమానుల వైపు నుంచి మరో సమాధానం వస్తోంది. ఎన్టిఆర్ శతజయంతి ఉత్సవాలకు తారక్‎ని ఆహ్వానించారా? అని ప్రశ్నిస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ తారక్‎ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తోందనే రూమర్స్‏ని తెరమీదకు తీసుకువస్తున్నారు. బాలయ్య, ఎన్టీఆర్ మధ్య సంబంధాల గురించి కూడా పెద్ద చర్చ జరుగుతోంది. అయితే ఇది కేంద్రం నిర్వహించింది కాబట్టి విభేదాలని పక్కన పెట్టి ఎన్టీఆర్ హాజరయితే బాగుండేది అనేవారు ఎక్కువగా ఉన్నారు.

Rumours over Jr NTR not attending Sr NTR Commemorative coin program

India President, Draupadi Murmu, Nandamuri Taraka Rama Rao, NTR, founder of TDP, late chief minister , world famous actor, Chief Minister, AP, Andhra Pradesh, TDP Chief, Chandrababu,Chief of AP BJP, NTR's daughter, Purandeshwari, Daggupati Venkateswarlu, Actor, Balakrishna, Nara Brahmani, NTR family members, TDP , Rashtrapati Bhavan, Commemorative coin , prestigious program, NTR centenary celebrations, Jr. NTR,

Updated : 28 Aug 2023 5:09 PM IST
Tags:    
Next Story
Share it
Top