Home > సినిమా > Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఆస్కార్‌ కమిటీ అరుదైన గౌరవం

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఆస్కార్‌ కమిటీ అరుదైన గౌరవం

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఆస్కార్‌ కమిటీ అరుదైన గౌరవం
X

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో అరుదైన గుర్తింపు సాధించారు. ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్‌లో మెంబర్ గా చోటు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని అకాడమీ (Oscars Academy) సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు ఎన్టీఆర్‌ను కొత్త అకాడమీ మెంబర్‌గా పరిచయం చేస్తూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట సమయంలోని విజువల్స్‌ను షేర్‌ చేసింది. ప్రస్తుతం అకాడమీ పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇది చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదో ప్రౌడ్‌ మూమెంట్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన తారక్.. ప్రతిష్టాత్మక ఆస్కార్‌ కమిటీలోని నటుల కేటగిరీలోకి ఎన్టీఆర్‌ను చేర్చింది. ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ కోసం అకాడమీ ప్రపంచవ్యాప్తంగా అగ్ర నటులను స్వాగతించగా.. వారిలో ఎన్టీఆర్ ఒకరిగా నిలిచారు. గురువారం (అక్టోబర్ 19) తెల్లవారుజామున అకాడమీ తన కొత్త మెంబర్స్ యాక్టర్స్ లిస్ట్ ని అనౌన్స్ చేసింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ ఏడాది సభ్యులుగా చేరిన ఐదుగురు నటుల పేర్లను వెల్లడించింది. ఈ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటుగా కే హుయ్ క్వాన్, మార్షా స్టెఫానీ బ్లేక్, కెర్రీ కాండన్, రోసా సలాజర్ వంటి ఇతర నటీనటులకు చోటు కల్పిస్తున్నట్లు తెలియజేశారు.

'ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ (Oscars) పురస్కారాన్ని గెలుచుకొని భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని విశ్వవేదికపై ఘనంగా చాటింది. దేశానికి తొలి ఆస్కార్‌ను అందించిన చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చరిత్ర సృష్టించింది. ఇక ఈ చిత్రంతో టాలీవుడ్‌ స్టార్‌ నటులు జూనియర్‌ ఎన్టీఆర్ (Jr NTR)‌, రామ్‌ చరణ్‌ (Ram Charan) గ్లోబల్‌ లెవల్‌లో ఓ రేంజ్‌ పాపులారిటీని సంపాదించుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు లేటెస్టుగా తారక్ ప్రతిష్టాత్మక 'అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్‌' జాబితాలో చేరిపోయారు. ఇది నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు, ఇండియన్ సినిమాకే గర్వకారణమైన విషయమని చెప్పాలి.


Updated : 19 Oct 2023 12:25 PM IST
Tags:    
Next Story
Share it
Top