Home > సినిమా > Jr.NTR: ఎన్టీఆర్ దూకుడుకు అసలు కారణం ఏంటీ..

Jr.NTR: ఎన్టీఆర్ దూకుడుకు అసలు కారణం ఏంటీ..

Jr.NTR: ఎన్టీఆర్ దూకుడుకు అసలు కారణం ఏంటీ..
X

ఒక సినిమాతో వచ్చిన భారీ ఇమేజ్ ను కంటిన్యూ చేస్తూ కథలు ఎంచుకోవడం అంత సులువు కాదు. ఎంచుకున్న తర్వాత ఆలస్యం చేయడం అంత మంచిది కాదు. అందుకే లేట్ గా మొదలుపెట్టినా.. ఏ మాత్రం లేట్ చేయకుండా నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న దేవర పార్ట్ 1 చిత్రీకరణ వేగం చూస్తే ఎన్టీఆర్ ఎంత ఫోకస్డ్ గా ఉన్నాడో అర్థం అవుతుంది. మరి ఇంత వేగంగా ఎందుకు షూటింగ్ చేస్తున్నారో తెలుసా..? వచ్చే యేడాది రెండు సినిమాలు రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు ఎన్టీఆర్. అందుకే ఈ దూకుడు. ఇప్పటికే దేవరకు ఫస్ట్ పార్ట్ కు సంబంధించి మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తయింది. ఈ పార్ట్ లో కూడా ఎక్కువ శాతం యాక్షన్ సీక్వెన్స్ లే ఉన్నాయి. ముఖ్యంగా సముద్రంలో అండర్ వాటర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఫైట్ ఈ దశాబ్దంలోనే తెలుగులో చూడనంత రేంజ్ లో ఉంటుందని ఊరిస్తోంది టీమ్. కోస్టల్ కారిడార్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీలో ఎన్టీఆర్ తండ్రి, కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే ప్రచారం బాగా ఉంది. తనయుడి పాత్ర సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోందట. ఇక ఇద్దరికీ కూడా విలన్ గా సైఫ్ అలీఖానే ఉంటాడంటున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం చేస్తోన్న కారణంగా కూడా అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జరుగుతోంది. గోవా నుంచి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఫస్ట్ టైమ్ చేస్తోన్న బాలీవుడ్ మూవీ ‘వార్2’ చిత్రీకరణ కోసం ముంబై వెళతాడని టాక్. వార్2లో అతనితో పాటు హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీపైనా భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాలను కూడా 2024లోనే విడుదల చేయాలనే సంకల్పంతో ఉన్నారు. అందుకే ఎన్టీఆర్ మరో ఆలోచన లేకుండా పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టాడు. వీటిలో దేవర పార్ట్ 1 2024 ఏప్రిల్ 5న విడుదల కాబోతోంది. వార్2 2024 దసరా లేదా దీపావళికి విడుదల కావొచ్చంటున్నారు. మరోవైపు వచ్చే ఏప్రిల్ తర్వాత నుంచి ప్రశాంత్ నీల్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. మొత్తంగా రాబోయే రెండేళ్లలో ఎన్టీఆర్ రేంజ్ ఎవరూ ఊహించని విధంగా మారబోతోందని చెప్పొచ్చు. కాకపోతే ఇవన్నీ బ్లాక్ బస్టర్స్ గా నిలవాలి.

Updated : 30 Oct 2023 12:51 PM IST
Tags:    
Next Story
Share it
Top