Home > సినిమా > బిగ్‌బాస్‌ ఫైనల్ కేసు ముందుకు.. నిర్వాహకులకు నోటీసులు

బిగ్‌బాస్‌ ఫైనల్ కేసు ముందుకు.. నిర్వాహకులకు నోటీసులు

బిగ్‌బాస్‌ ఫైనల్ కేసు ముందుకు.. నిర్వాహకులకు నోటీసులు
X

బిగ్‌బాస్‌ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 17వ తేదీన జరిగిన బిగ్ బాస్ ఫైనల్ అనంతరం జరిగిన ఘర్షణకు సంబంధించి పోలీసులు నోటీసులు ఇచ్చారు. బిగ్‌బాస్‌ యాజమాన్యం ఎండమోల్‌ షైన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు పోలీసుల నోటీసులు అందించారు. ఫైనల్స్ అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద అభిమానులు కార్లు, బస్సుల అద్దాలను ద్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు పోలీసులు 24 మందిని అరెస్ట్ చేశారు. విన్నర్ పల్లవి ప్రశాంత్ ను కూడా అరెస్ట్ చేశారు. అయితే అతనికి నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో రెండు రోజుల క్రితం విడుదలయ్యాడు.



Updated : 25 Dec 2023 8:27 PM IST
Tags:    
Next Story
Share it
Top