Home > సినిమా > Prabhas Kalki : ప్రభాస్ సినిమాలో తారక్, నాని!

Prabhas Kalki : ప్రభాస్ సినిమాలో తారక్, నాని!

Prabhas Kalki  : ప్రభాస్ సినిమాలో తారక్, నాని!
X

(Prabhas Kalki) టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల హవా ఎక్కువైంది. జక్కన్న తీసిన బాహుబలి తర్వాత తెలుగు సినిమాలను అన్ని భాషల్లోనూ విడుదల చేసేందుకు నిర్మాతలు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో వైజయంతి మూవీస్ టీమ్ మరో అడుగు ముందుకేసి పాన్ వరల్డ్ మూవీ చేస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్‌తో కల్కి 2898 AD అనే మూవీని తెరకెక్కిస్తోంది. ఈ చిత్రానికి నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. మరో మూడున్నర నెలల్లో ఈ మూవీ సిల్వర్ స్క్రీన్‌పై అతి పెద్ద విజువల్ వండర్‌గా దర్శనమివ్వనుంది.

ప్రభాస్‌తో పాటు ఈ మూవీ బిగ్ స్టార్స్ అంతా ఉన్నారు. భూత భవిష్యత్ కాలాల నేపథ్యంలో ఈ మూవీ సాగనుందని మేకర్స్ ఇదివరకే చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. బాలీవుడ్ స్టార్స్ దీపిక పదుకొనె, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, దిశాపటానీ వంటివారు ఇందులో నటిస్తుండగా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఇందులో విలన్‌గా నటిస్తున్నారు. వీళ్లతో పాటు ప్రత్యేక పాత్రల్లో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండలు కనిపిస్తారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

ఇకపోతే ఈ మూవీలో స్పెషల్ రోల్స్‌లో తారక్, నాని కనిపించనున్నట్లు తెలుస్తోంది. పరశురాముడిగా జూనియర్ ఎన్టీఆర్, కృ‌పాచార్యగా నాని కొన్ని నిమిషాల పాటు కనిపిస్తారట. దీనిపై ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది. క్లైమాక్స్‌కు ముందు వచ్చే కీలక సీన్స్‌లో ఈ ఇద్దరు హీరోలు కనిపించనున్నారట. అయితే ఇందులో నిజమెంత ఉందో తెలీదు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీ మే 9వ తేది విడుదల కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలతో పాటుగా పలు విదేశీ భాషల్లో ఈ మూవీ పాన్ వరల్డ్ చిత్రంగా విడుదల కానున్నట్లు మేకర్స్ తెలిపారు.






Updated : 30 Jan 2024 9:11 AM IST
Tags:    
Next Story
Share it
Top