Home > సినిమా > Kantara 2. : సినీ లవర్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. కాంతారా-2లో ఎన్టీఆర్!

Kantara 2. : సినీ లవర్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. కాంతారా-2లో ఎన్టీఆర్!

Kantara 2. : సినీ లవర్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. కాంతారా-2లో ఎన్టీఆర్!
X

కన్నడ మూవీ కాంతారా పాన్ ఇండియా లెవల్లో విడుదలై మంచి హిట్ కొట్టింది. మలయాళం తర్వాత తెలుగులోకి ఎక్కువగా కన్నడ సినిమాలే డబ్ అవుతున్నాయి. కాంతారా సూపర్ డూపర్ హిట్ సాధించిన తర్వాత ఇప్పుడు కాంతారా మూవీకి ప్రీక్వెల్ రానుంది. హీరో రిషబ్ శెట్టి ఈ మూవీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కాంతారా 2 కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాంతారా సినిమాను చూసి థ్రిల్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు కాంతారా 2పై భారీ అంచనాలే పెట్టుకున్నారు. కొన్ని రోజుల ముందు కాంతారా పార్ట్2కు సంబంధించి ఫస్ట్ లుక్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంది.

తాజాగా కాంతారా ప్రీక్వెల్ మూవీకి సంబంధించి సినీ లవర్స్‌కు కిక్కిచ్చే న్యూస్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీలో దీనిపై టాక్ నడుస్తోంది. కాంతారా ప్రీక్వెల్‌లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడట. అది కూడా హీరో రిషబ్ శెట్టికి తండ్రిగా ఎన్టీఆర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రీక్వెల్‌లో ఎన్టీఆర్ చేసే సాహసాలు, పూజలను మూవీలో చూపించనున్నారట. అయితే ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే మరికొంత కాలం ఎదురుచూడాల్సిందే.

ఆమధ్య డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇంట్లో ఓ ఫంక్షన్ జరిగింది. ఆ కార్యక్రమానికి తారక్, రిషబ్ శెట్టి ఇద్దరూ హాజరవ్వడంతో కాంతారా 2 మూవీ కోసమే వాళ్లు అలా కలిసినట్లు చర్చలు సాగుతున్నాయి. ఇప్పుడు కన్నడ మీడియాలో ఇదే హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఎన్టీఆర్ అభిమానులైతే ఆ వార్త నిజం అయితే బావుండు అని అనుకుంటున్నారు. కాంతారాకు తెలుగులో పెద్ద ఫ్యాన్సే ఉన్నారు. అలాంటి మూవీలో ఎన్టీఆర్‌ను చూస్తే ఇక అభిమానులకే పూనకాలే. రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కాంతారా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.400కోట్ల వరకూ కలెక్షన్స్ సాధించింది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సంచలన విజయం సాధించింది.





ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' మూవీ చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ సినిమా ఇప్పటి వరకూ విడుదల కాలేదు. దేవర మూవీని ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దాంతో పాటుగా వార్2, బాలీవుడ్ స్పై యూనివర్స్‌లో ఓ ప్రాజెక్ట్‌ చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ వరుసపెట్టి సినిమాలు చేస్తుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Updated : 10 March 2024 2:02 PM IST
Tags:    
Next Story
Share it
Top