Jyothika Surya Divorce: సూర్య, జ్యోతికా విడాకులు.. ఇంతకీ ఏం జరిగింది? జ్యోతిక స్పందన ఇదే
X
సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య విడాకులు కామన్ అయిపోయాయి. ముఖ్యంగా లవ్ మ్యారేజీ చేసుకున్నవారిలో. చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి విడిపోతున్నారు. ఎంత ఈజీగా ఒకటవుతున్నారో... అంతే ఈజీగా దూరమవుతున్నారు. ఇలానే ఇండస్ట్రీలోనే పరిచయమై ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సూర్య, జ్యోతిక. వీరి మధ్య ఉన్న బాండింగ్ తో.. ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ అని పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరికీ ఓ పాప, బాబు కూడా ఉన్నారు. ఫ్యామీలీ జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్న ఈ జంట.. ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఏ ఒక్కసారి కూడా ట్రోలింగ్ కు గురికాలేదు. అయితే ఇటీవల వీరిపై కొన్ని రూమర్స్ మొదలయ్యాయి. వీరి మధ్య కుటుంబ కలహాలు చోటుచేసుకున్నాయని, త్వరలో విడాకులు తీసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
ఇప్పటికే ఉమ్మడి కుటుంబం నుంచి వేరై.. వీరిద్దరు ముంబైకి షిఫ్ట్ కావడంతో ఈ రూమర్స్ కు ఇంకా గట్టి బలం చేకూరింది. అంతేకాకుండా జ్యోతిక వరుసగా బాలీవుడ్ లో మూడు సినిమాలు చేయడంతో.. ఆ వార్తల్లో నిజం అని నమ్ముతున్నారంతా. ఈ నేపథ్యంలో తమ కుటుంబంపై వస్తున్న రూమర్స్ పై జ్యోతిక స్పందించింది. సూర్యకు తనకు మధ్య ఎలాంటి గొడవలు జరగలేదని, పిల్లల చదువు, బాలీవుడ్ సినిమాలకు ఇచ్చిన కమిట్మెంట్ కారణంగా ముంబైకి షిఫ్ట్ అయినట్లు చెప్పుకొచ్చింది. వారి చదువు అయిపోగానే చైన్నైకి షిఫ్ట్ అయిపోతామని క్లారిటీ ఇచ్చింది. అంతేతప్ప సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, తమ మధ్య ఎలాంటి కలహాలు లేవని స్పష్టం చేసింది. సూర్య చాలా సిన్సియర్ వ్యక్తి అని, కుటుంబం పట్ల ఎంతో బాధ్యతగా ఉంటాడని చెప్పింది. ఇక జ్యోతిక వివరణతోనైనా విడాకుల ప్రచారానికి తెర పడుతుందేమో వేచి చూడాలి.