Home > సినిమా > దూకుడుగా కాజల్ అగర్వాల్

దూకుడుగా కాజల్ అగర్వాల్

దూకుడుగా కాజల్ అగర్వాల్
X

కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీలోనూ దూకుడు చూపిస్తోంది. పెళ్లి, బిడ్డ కోసం కొంత గ్యాప్ తీసుకున్న కాజల్ బాలకృష్ణ భగవంత్ కేసరితో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో తనకు కాత్యాయనిగా మంచి పాత్రే పడింది.ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ కథతో సత్యభామగా రాబోతోంది కాజల్. శశికాంత్ టిక్కా సమర్పణలో శ్రీనివాసరావు తక్కలపెల్లి, బాబీ టిక్కా నిర్మిస్తున్నారు. సుమన్ చిక్కాల డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో కాజల్ ఓ ఫెరోషియస్ పోలీస్ పాత్రలో నటిస్తోందని కొన్నాళ్ల క్రితం విడుదల చేసిన గ్లింప్స్ చూస్తే అర్థం అయింది. చాలా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతోందని చెప్పకనే చెప్పారు. సత్యభామతో తను కూడా నయనతారలాగా బలమైన కథలున్న పాత్రల్లో నటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

ఇక కొన్నాళ్ల క్రితమే ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ మూవీ 35 రోజుల పాటు సాగిన భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఒక లేడీ ఓరియంటెడ్ మూవీకి ఇంత పెద్ద షెడ్యూల్ అంటే సినిమా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. వీలైనంత త్వరలోనే విడుదల చేయబోతోన్న ఈ మూవీలో కాజల్ తో పాటు నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, హర్ష వర్థన్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం చేస్తుండగా విష్ణు బేసి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

Updated : 4 Jan 2024 6:54 PM IST
Tags:    
Next Story
Share it
Top