Prabhas Kalki: ...వాళ్లకు ప్రభాస్ కల్కీ స్ట్రాంగ్ వార్నింగ్
X
నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ సినిమా కల్కి 2898ఏడీ. ఇటీవలే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కు విశేష ఆధరణ లభించింది. ప్రస్తుతం కల్కి షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. సంక్రాంతికి రిలీజ్ చేద్దామని అనుకున్నారు. దాంతో ఎడిటింగ్ వర్క్ లో ఫుల్ బిజీ అయిపోయారు మేకర్స్. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హసన్, దీపికా పదుకొనే వంటి స్టార్లు నటిస్తున్నారు. కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండటంతో.. సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే అన్ని సినిమాలకు ఉన్నట్లే ఈ సినిమాకు లీకుల బెడద మొదలయింది. మేకర్స్ ఎంత జాగ్రత్త పడుతున్నా.. లీక్ అవుతూనే ఉన్నాయి. తాజాగా సినిమాలోని ప్రభాస్ ఫొటో లీక్ అయింది.
ఫొటో లీక్ అవడంలో వీఎఫ్ఎక్స్ టీం హస్తం ఉందని సమాచారం. ఈ లీక్స్ పై మూవీ మేకర్స్ చాలా సీరియస్ గా ఉన్నారు. దీంతో చిత్ర బృదం సినిమాపై కాపీ రైట్ తీసుకుంది. దానికి సంబంధించిన నోటీస్ తాజాగా విడుదల చేసింది. ‘సినిమాపై హక్కులు తమకే ఉన్నాయని, తమ ప్రమేయం లేకుండా ప్రజలకు తెలియాలని సినిమాను లీక్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామ’ని గట్టిగా హెచ్చరించారు. సైబర్ పోలీసుల సహకారంతో నేరస్తులకు కఠిన శిక్ష అమలయ్యేలా చూస్తామని చెప్పుకొచ్చారు.