కల్కీ వచ్చేది సమ్మర్కు కాదు.. విడుదల మరోసారి వాయిదా
X
కల్కి 2989 AD.. పాన్ ఇండియా ప్రభాస్ అభిమానులు ఈ సినిమాకు ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ హీరోగా, దీపిక పదుకొణె హీరోయినగా, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న సినిమా ఇది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో, వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతోంది. ఈ ఏడాది వేసవి కానుకగా.. ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ ఫ్యూచరిస్టిక్ మూవీ మే 9న విడుదల కానున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కల్కి 2989 AD మొత్తం మూడు భాగాలుగా రాబోతుందని, ఫస్ట్ పార్ట్ షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యిందని టాక్. ప్రస్తుతం సెకండ్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతుందట.
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంటే.. మే 9 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యేది. అందుకు ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ ని ఫుల్ స్వింగ్ లో నడిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో కల్కీ విడుదల వాయిదా పడిందని మరోసారి వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, సీజీ వర్క్ పూర్తిచేయడం కష్టమవుతున్న కారణంగా మేకర్స్ ఆల్టర్ నేట్ డేట్స్ ను ఆలోచిస్తున్నారట. ఈ వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. కాగా ఆగష్టు 15న విడుదల కానుందని సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి పూర్తిస్థాయి క్లారిటీ రావాల్సి ఉంది.