Home > సినిమా > కల్యాణ్‌ రామ్‌ భార్యకు ఆ హీరో అంటే ఇష్టం ?

కల్యాణ్‌ రామ్‌ భార్యకు ఆ హీరో అంటే ఇష్టం ?

కల్యాణ్‌ రామ్‌ భార్యకు ఆ హీరో అంటే ఇష్టం ?
X

కళ్యాణ్ రామ్ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా వార్తలు రావు. తన పర్సనల్ లైఫ్ ని మీడియాకి చాలా దూరంగా ఉంచుతారు. అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్ , ఆడియో ఫంక్షన్స్‎లో మాత్రమే భార్య, పిల్లలు కనబడతారు. అయినా అభిమానులు మాత్రం కల్యాణ్ రామ్ ఫ్యామిలీ విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు. వారి భార్య ఎవరూ, పిల్లలు ఏం చేస్తున్నారు. అనే అంశాలపై సోషల్ మీడియాలో వెతుకుతూ ఉంటారు. ఇదే క్రమంలో కల్యాణ్ రామ్ భార్య గురించి ఓ వార్త వైరల్‎గా మారింది.

కళ్యాణ్ రామ్ భార్య స్వాతి.. టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జునకు పెద్ద ఫ్యాన్ అని తెలుస్తోంది. నాగార్జున సినిమాలకు కాలేజ్ డుమ్మాకొట్టి చూసేవారంట. మన్మథుడు సినిమాను లెక్కలేనన్ని సార్లు చూశారట. ఇప్పటికీ నాగార్జునను ఆమె అభిమానిస్తారని..ఆయన నటించిన ప్రతి సినిమాను చూస్తారని సమాచారం.

2006 ఆగస్టు 10న కల్యాణ్‌ రామ్, స్వాతిల వివాహం జరిగింది. తను వృత్తిరీత్యా ఓ డాక్టర్‌. ఈ దంపతులకు అదైత, శౌర్య‌రామ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వాతి తండ్రి ఓ బిజినెస్ మెన్. వారికి ఫార్మా కంపెనీలు ఉన్నాయి. వివాహం తర్వాత స్వాతి తన డాక్టర్ వృత్తిని వదిలి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఓ వీఎఫ్‌ఎక్స్ సంస్థను స్థాపించి ఇప్పుడు ఆ వ్యవహారాలు చూసుకుంటున్నారు. కల్యాణ్ రామ్ నటించిన చిత్రాలకు అక్కడే విఫ్ఎక్స్ చేస్తారు. బింబిసార సినిమాలోని వీఎఫ్ఎక్స్ సంస్థ నుంచే చాలా తక్కువ టైంలో మంచి అవుట్‌ పుట్ ఇచ్చారు.


Updated : 28 Jun 2023 5:32 PM IST
Tags:    
Next Story
Share it
Top