Home > సినిమా > ‘ప్రాజెక్ట్‌ కె’ లో కమల్‌హాసన్ అంటూ ఫేక్ న్యూస్ వైరల్..

‘ప్రాజెక్ట్‌ కె’ లో కమల్‌హాసన్ అంటూ ఫేక్ న్యూస్ వైరల్..

‘ప్రాజెక్ట్‌ కె’ లో కమల్‌హాసన్ అంటూ ఫేక్ న్యూస్ వైరల్..
X

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాష్ నటిస్తున్న చిత్రం ప్రాజెక్టు కె. సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే , దిశా పటానీలతో పాటు అమితాబ్‌ బచ్చన్‌ వంటి స్టార్స్‌ నటిస్తుండడంతో ప్రాజెక్టు కె పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా చిత్రానికి సంబంధించి మరో వార్త వైరల్‎గా మారింది.విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ ‘ప్రాజెక్ట్‌ కె’ లో విలన్‌గా నటిస్తున్నట్టు సోషల్ మీడియాలో తెగ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కేవలం 30 నిమిషాలు కనిపిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అందుకోసం ఏకంగా రూ.150 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ తీసుకున్నట్లు కూడా చెబుతున్నారు. అయితే ఈ వార్తలు ఫేక్ అని తెలుస్తోంది. ప్రాజెక్టు కె లో కమలహాసన్ నటించడం లేదని సమాచారం.

ఇప్పటికే 'ప్రాజెక్ట్ కె' 70 శాతం షూటింగ్‌ పూర్తయింది.జనవరి 12, 2024న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీనికి సంబంధించి పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే వివిధ కారణాలతో షూటింగ్ ఆలస్యం కారణంగా రిలీజ్ డేట్ మారే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల కిందట అమితాబ్ బచ్చన్ షూటింగ్‌లో గాయాపడ్డారు.

వరుసు చిత్రాలతో ప్రభాష్ ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నాడు.ఆయన నటించిన ‘ఆదిపురుష్‌’ జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ప్రశాంత్‌ నీల్ డైరెక్షన్‌లో నటిస్తున్న ‘సలార్‌’, మారుతి దర్వకత్వంలో మరో చిత్రం సెట్స్‌ పై ఉన్నాయి.





Updated : 31 May 2023 9:48 PM IST
Tags:    
Next Story
Share it
Top