ఇదేంటి కమల్ ఇలా షాకిచ్చావ్
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ 'కల్కి 2898AD' కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మూవీలో ఇప్పటి వరకూ చూడని లుక్‌లో కనిపించనున్నారు. ఈ మూవీని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, దీపికా పదుకొణె, కమల్ హాసన్ లాంటి వారు నటిస్తుండటంతో భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీ షూటింగ్ ఆఖరి దశకు చేరిందని మేకర్స్ ప్రకటించినప్పటి నుంచి థియేటర్లలో సినిమా చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
మహాభారతం ఇతిహాసాల ఆధారంగా సాగే ఈ మూవీలో భైరవ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు. తాజాగా ఈ మూవీపై కమల్ హాసన్ అభిమానులకు షాకిచ్చే న్యూస్ చెప్పారు. కల్కి మూవీలో తాను విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడని అందరికీ తెలిసిందే. అయితే తాను కల్కి మూవీలో విలన్ పాత్ర చేయడంలేదని, తనది కేవలం ఓ గెస్ట్ రోల్ మాత్రమేనని చెప్పి షాకిచ్చారు. ఇప్పటికే తన రోల్ కంప్లీట్ అయ్యిందని చెప్పేశాడు. దీంతో ఈ మూవీలో కమల్ క్యారెక్టర్‌కు పెద్దగా స్కోప్ లేదని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
అయితే డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాత్రం ఈ మూవీలో కమల్ పాత్రకు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందని, ఫ్యాన్స్ థ్రిల్ అయ్యే సీన్స్ కమల్‌పై ఉంటాయని చెప్పారు. మే 9న కల్కి మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే ఎన్నికల వల్ల ఈ మూవీ పోస్ట్‌పోన్ అవుతుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. వాటిపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.