'ఇండియా ఈజ్ ఇందిరా.. ఇందిరా ఈజ్ ఇండియా'.. ‘ఎమర్జెన్సీ’ టీజర్ చూశారా?
X
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. దేశంలో 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులకు అనుగుణంగా ఈ సినిమా తీసింది కంగనా. ఇందులో ఆమె అప్పటి ప్రధాన మంత్రి, దివంగత ఇందిరా గాంధీ పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాకు దర్శకత్వంతో పాటుగా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. శనివారం ఈ మూవీ నుంచి “ప్రొటెక్టరా లేదా డిక్టెటరా? సొంత ప్రజలపై మన దేశ నాయకురాలు యుద్ధం ప్రకటించినప్పటి చీకటి రోజులకు సాక్ష్యమిది. నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది” అనే క్యాప్షన్‌తో హిందీ టీజర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కంగనా రనౌత్.
టీజర్లో 'ఇండియా ఈజ్ ఇందిరా.. ఇందిరా ఈజ్ ఇండియా' అన్న డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నవంబర్ 24న విడుదల కానుంది. మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతం సమకూరుస్తున్నారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో దేశంలోని ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు అన్నీ తానై వ్యవహరించారు కంగనా. ఈ సినిమాతో 1975 నాటి ఎమర్జెన్సీ వాతావరణాన్ని దాదాపు 48 ఏళ్ల తర్వాత ప్రజలకు చూపే ప్రయత్నం చేస్తున్నారు కంగనా. దేశంలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు ఏర్పడడం 'మన చరిత్రలో అది ఓ చీకటి దశ' అని పేర్కొన్నారు.