వాహ్ అదిరిందిగా...మెరిసిపోతున్న చంద్రముఖి 2
X
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా నటిస్తున్న సినిమా చంద్రముఖి -2. ఇందులోని రాఘవ ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదల చేశారు. ఈరోజు చంద్రముఖిగా కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేసింది మూవీ టీమ్. దీనికి కూడా పీ.వాసునే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు.
లైకా ప్రొడక్షన్స్ లో వస్తున్న చంద్రముఖి 2 లో కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. పట్టుచీర, అలంకారలతో బాలీవుడ్ కాంట్రవర్శీ క్వీన్ మెరిసిపోతోంది. ఫస్ట్ లుక్ లో చంద్రముఖి భయపెట్టేదిగా కాకుండా అందంగా కనబడేటట్టు డిజైన్ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎమ్ ఎమ్ కీరవాణి మ్యూజిక్ చేస్తున్నారు.
చంద్రముఖి 2 లో రాఘవ లారెన్స్ , కంగనా రనౌత్ తో పాటూ సీనియర్ కమెడియన్ వడివేలు కీలకపాత్రలో నటిస్తున్నారు. మహిమా నంబియార్, లక్ష్మీ మీనన్, సిరుష్టి డాంగే, రావు రమేష్, విఘ్నేష్, సురేష్ మీనన్ తదితరులు ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమాను తమిళంతో పాటూ తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నారు. 18 ఏళ్ళ ముందు రజనీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖికి సీక్వెల్ ఇది.
The beauty ✨ & the pose 😌 that effortlessly steals our attention! 🤩 Presenting the enviable, commanding & gorgeous 1st look of #KanganaRanaut as Chandramukhi 👑💃 from #Chandramukhi2 🗝️
— Lyca Productions (@LycaProductions) August 5, 2023
Releasing this GANESH CHATURTHI in Tamil, Hindi, Telugu, Malayalam & Kannada! 🤗
🎬… pic.twitter.com/KZPMPd5PkB