Home > సినిమా > నాకు పెళ్లి చేసుకుని.. పిల్లలను కనాలని ఉంది.. కంగనా రనౌత్

నాకు పెళ్లి చేసుకుని.. పిల్లలను కనాలని ఉంది.. కంగనా రనౌత్

నాకు పెళ్లి చేసుకుని.. పిల్లలను కనాలని ఉంది.. కంగనా రనౌత్
X

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ తన మనసులోని మాట చెప్పేసింది. చానాళ్ల తరువాత ఈ బ్యూటీ పెళ్లి గురించి మాట్లాడి ఫ్యాన్స్‎ను ఖుషీ చేసింది.

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఫైర్ బ్రాండ్ అని పేరు తెచ్చుకున్న కంగనా ఇంకెన్నాళ్లు ఇలా ఒంటరి జీవితం అని అనుకుంది కాబోలు, మెడలో మూడు ముళ్లు వేయించుకుని తన కుటుంబంతో కొత్త లైఫ్‎ని ప్రారంభించాలని అనుకుంటోందట . ఈ విషయాన్ని కంగనాయే స్వయంగా తెలిపింది.



కంగనా వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ఈ చిన్నది త్వరలో రిలీజ్ కాబోతున్న టీకూ వెడ్స్‌ షేరు సినిమా ప్రమోషన్స్‌లో మునిగిపోయింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది కంగనా." ఎప్పుడు ఏది జరగాలని రాసి ఉంటే అదే జరుగుతుంది. తొందరపడితే ఎలాంటి ఉపయోగం ఉండదు. నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. పిల్లలను కనాలని ఉంది. ఈ బ్యాచిలర్ లైఫ్‎ని వీడి ఓ కుటుంబాన్ని ఏర్పరుచుకోవాలని ఆశగా ఉంది. అదంతా ఎప్పుడు జరగాల్సి ఉంటే అప్పుడే జరుగుతుంది" అని కంగనా తెలపింది.





గతంలోనూ పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది కంగనా. " ధాకడ్‌ సినిమాలో ఉన్నట్లుగా నిజ జీవితంలోనూ నేను టామ్‌ బాయ్‌గా ఎందుకు ఉంటాను. నేను కొడతానని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతానని నాపై లేనిపోని పుకార్లు పుట్టిస్తే ఎలా? ఈ పుకార్లు విన్నవారు నన్ను పెళ్లి చేసుకునేందుకు ముందుకు వస్తారా? నాకు అసలు పెళ్లి అవుతుందా?"అంటూ చెప్పుకొచ్చింది.

కంగనా రనౌత్ ప్రస్తుతం నవాజుద్దీన్ సిద్ధిఖీ , అవ్నీత్ కౌర్ ప్రధాన పాత్రలలో నటించిన టికు వెడ్స్ షేరు సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని జూన్ 23న ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, కంగనా రనౌత్ తన తదుపరి చిత్రం ఎమర్జెన్సీలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.






Updated : 17 Jun 2023 12:07 PM IST
Tags:    
Next Story
Share it
Top