సౌత్ హీరోలంటే చిన్న చూపు.. అందుకే నో చెప్తోంది
X
కంగనా రనౌత్.. ఏం మాట్లాడినా హాట్ టాపిక్ అవుతుంది. తన తీరుతో చాలామంది చేత విమర్శలు ఎదుర్కొటుంది. అందుకే వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బోల్డ్ బ్యూటీ చుట్టూ కొత్త వివాదం నడుస్తోంది. తన మనసులో ఏమున్నా బయటపెట్టే కంగనా.. సౌత్ హీరోలతో సినిమాలకు నో చెప్తోంది. దీంతో సౌత్ ఇండస్ట్రీ మొత్తం కంగనాపై మండి పడుతున్నారు. సౌత్ హీరోలంటే తనకు ఎందుకు చిన్న చూపు అని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ధనుష్ సినిమాలో ఛాన్స్ ఇస్తే.. దానికి నో చెప్పడమే ఈ వివాదానికి కారణం.
ధనుష్ నటిస్తున్న 50వ సినిమా కావడంతో సన్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ సినిమాలో నటించాలని కంగనాను కోరగా.. తనకు కాల్ షీట్స్ లేవని నో చెప్పింనట్లు సమాచారం. దీంతో ఆ సినిమాలో త్రిషను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇదివరకు శింబుతో నటించడానికి కూడా కంగనా నో చెప్పింది. దీంతో ఆవిడ కావాలనే సౌత్ హీరోలను దూరం పెడుతుందనే ప్రచారం నడుస్తోంది. దీనిపై కంగనా ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో చూడాలి.