Home > సినిమా > Chandramukhi 2: ‘చంద్రముఖి2’ కోసం కంగనకు షాకింగ్ రెమ్యునరేషన్...

Chandramukhi 2: ‘చంద్రముఖి2’ కోసం కంగనకు షాకింగ్ రెమ్యునరేషన్...

Chandramukhi 2: ‘చంద్రముఖి2’ కోసం కంగనకు షాకింగ్ రెమ్యునరేషన్...
X

సెప్టెంబర్ 28న చంద్రముఖి2 సినిమా థియేటర్లలో విడుదల కానుంది. డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్‌,బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం చంద్రముఖి మ్యాజిక్‎ను రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. చంద్రముఖి సినిమాలో జ్యోతిక చంద్రముఖిగా కనిపించి ప్రేక్షకులను ఓ రేంజ్‎లో భయపెట్టింది. సూపర్ స్టార్ రజినీకాంత్ తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్‏తో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశారు. ఇక సెకెండ్ పార్ట్‎లో కంగనా రనౌత్ చంద్రముఖిగా కనిపించబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, సాంగ్స్‌ చూశాక ఆడియన్స్ సినిమాపై ఓ అంచనాకు వచ్చారు. ఇలాంటి కాన్సెప్ట్ ఎంచుకుని లారెన్స్‌ రిస్క్ చేస్తున్నాడని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం నెట్టింట్లో చంద్రముఖి 2కి సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. చంద్రముఖి పాత్ర కోసం కంగనాకు ఇస్తున్న రెమ్యునరేషన్‎పై పెద్ద చర్చ నడుస్తోంది. ఈ మూవీ కోసం కంగనాకు భారీ పారితోషకం ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

బాలీవుడ్ నటి కంగనా వైవిధ్యమైన నటి. ఆమెకు బాలీవుడ్‎లో మంచి క్రేజ్ ఉంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆమె పెట్టింది పేరు. నిన్నామొన్నటి వరకు హిందీ సినిమాలు చేసిన కంగనా ఇప్పుడు తమిళ ఇండస్ట్రీవైపు చూస్తోంది. బాలీవుడ్‎లో ప్రస్తుతం కంగనాకు చెప్పుకొదగ్గ సినిమాలు ఏమీ లేవు. అందుకే తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటోందనే టాక్ బాగా వనిపిస్తోంది. ఇదివరకే కంగనా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోగ్రపీతో వచ్చిన తలైవి సినిమాలో నటించింది. తన నటనతో ఇండస్ట్రీలో మంచి మార్కులే కొట్టేసింది. ఇప్పుడు తాజాగా అప్పట్లో హిస్టరీని క్రియేట్ చేసిన చంద్రముఖి సీక్వెల్‎లో చంద్రముఖిగా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ స్కిల్స్‎పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందులోనూ ఆమెకు ఇచ్చే రెమ్యునరేషన్ పై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.

ఈ సినిమాకు గాను కంగాకు మేకర్స్ రూ.22 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. ఇది విన్న నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఆమెకు ఇచ్చిన పారితోషికంతో మీడియం బడ్జెట్ సినిమా తీయవచ్చని కామెంట్స్ పెడుతున్నారు. కంగనాకు ఈ సినిమాలో అవకాశం ఇవ్వడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువని అంటున్నారు. ఆమె యాక్టింగ్‎కు అంత రెమ్యునరేషన్ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సినిమా రన్‌టైమ్‌ గురించి ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. చంద్రముఖి 2 రన్‌టైమ్‌ ఏకంగా 170 నిమిషాలట పాటు ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అంటే సినిమా నిడివి 2 గంటల 50నిమిషాలు అన్నమాట. ఈ వార్త కూడా ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated : 15 Sep 2023 6:46 AM GMT
Tags:    
Next Story
Share it
Top